ఉధ్యోగాలే లేవు..మ‌రి రిజ‌ర్వేష‌న్ లు ఎవ‌రికి.?

news02 Jan. 10, 2019, 8:58 a.m. political

oc_reservastion_in_rajyasabha

న్యూడిల్లీ - మోడి ప్ర‌భుత్వం ఆగ‌మేఘాల మీద తెచ్చిన OC రిజర్వేషన్ల బిల్లుపై రాజ్యసభలో వాడి వేడి చ‌ర్చ జ‌రిగింది. బిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తూనే.. కాంగ్రెస్ బీజేపీపై విరుచుకుపడింది. బిల్లుని తీసుకొచ్చిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కీలకమైన బిల్లుని ఇంత హడావుడిగా ఆమోదించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ బిల్లుపై చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఉద్యోగాల క‌ల్ప‌న‌నే లేన‌ప్పుడు..  ఇక రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? అని నిలదీశారు. రిజ‌ర్వేష‌న్ ల‌కు సంభంధించి ఎలాంటి డేటా , ఎలాంటి నివేదిక లేకుండా హడావుడిగా బిల్లు తెచ్చారని ఫైర్ అయిన‌ సిబాల్..,  ఎలాంటి డేటా సేకరించకుండా ఈ రాజ్యాంగ సవరణ తేవడంలో అర్థమేంటో చెప్పాలన్నారు. రిజర్వేషన్లు అమలు చేయడానికి విధివిధానాలు ఎలా ఖరారు చేశారో వివరాలు సభ ముందు ఉంచాలని సిబల్ డిమాండ్ చేశారు.

/kapil_sibal_on_oc_reservastion_at_rajyasabha

బిల్లుపై చ‌ర్చ సంధ‌ర్భంగా.. సిబాల్ కేంద్రంపై ప్ర‌శ్నాల వ‌ర్షం కురించారు. రిజర్వేషన్ల బిల్లు చట్టపరంగా ఆమోదం పొందడానికి  అవరోధాలు ఉన్నాయని చెప్పారు. బిల్లుపై ముందుగా సెలెక్ట్ కమిటీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కీలకమైన రిజర్వేషన్ల బిల్లుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తీరు బాధాకరం అన్నారు. భారీగా ఉద్యోగాలు రావాలంటే ఆర్థికాభివృద్ధి జరగాలి కానీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.రెండున్న‌ర లక్షల నుంచే ఆదాయపన్ను కడుతున్నప్పుడు 8లక్షల ఆదాయం ఉంటే వెనబడినవాళ్లు ఎలా అవుతారని ప్ర‌శ్నించారు నిజమైన పేదలను ఈ రిజర్వేషన్ల పరిధి నుంచి ఎలా తప్పిస్తార‌న్న ఆయ‌న‌.,  నెలకు రూ.5వేలు, రూ.10వేలు సంపాదించే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మాటేంటి? వారు ఆర్థికంగా వెనకబడినవారు  అవుతారో లేదో.. కేంద్రం స్ప‌ష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు.

tags: kapil sibal, rajyasabha,oc reservastion, modi, pm, reseravastion, congress, parliament

Related Post