జానా రెడ్డిని బాబాను చేసిన కేటీఆర్..

news02 March 1, 2018, noon political

సూర్యాపేట్- మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై తీవ్రశ్తాయిలో ద్వజమెత్తారు.  సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా నూతనకల్‌ మండలం చిల్పకుంట్లలో రూ.143 కోట్లతో నిర్మించిన మిషన్‌ భగీరథ వాటర్‌ ప్లాంట్‌కు ఆయన ప్రారంభోత్సవం చేసి 175 గ్రామాలకు మంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పై తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఆలీబాబా 40 దొంగలు అన్నట్లు జానాబాబా 40 దొంగలుగా కాంగ్రెస్‌ నేతలు సిగ్గు, ఎగ్గు లేకుండా బస్సు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బస్సు యాత్ర చేస్తున్న వారందరిపై కేసులున్నాయని.. ఏమొహం పెట్టుకుని తీరుగుతున్నాకని ఆగ్రహం వ్యక్తం చేశారు,

గత 55 ఏళ్లుగా కాంగ్రెస్‌ .. దేశాన్ని, రాష్ట్రాన్నిపరిపాలించిందన్న కేటీఆర్.. ఇన్నేళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వారు ఏం చేశారని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా జలాలు వస్తే ఫ్లోరోసిస్‌ వ్యాధితో 2లక్షల మంది చితికిపోయేవారా అని అడిగారు. 15 ఏళ్లు మంత్రిగా ఉన్న జానారెడ్డి దేవరకొండ, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో ఫ్లోరోసిస్‌ తో ప్రజలు పడుతున్న బాధలు గుర్తుకురాలేదా అని మండిపడ్డారు కేసీఆర్.

tags: ktr, jana reddy, ktr fire on jana reddy, ktr fire on congress

Related Post