త‌మిళ‌నాడులో విచిత్ర ప‌రిస్థితి

news02 June 14, 2018, 6:06 p.m. political

two judges

మ‌ద్రాస్: గురువారం మ‌ద్రాస్ హైకోర్టులో ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై విశేషమైన‌ ప్ర‌భావం చూపించే అంశంలో హైకోర్టు న్యాయ‌మూర్తులు భిన్నంగా స్పందించారు. AIADMKలో దిన‌క‌ర‌ణ వ‌ర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ వేటు వేసిన అంశంపై దాఖ‌లైన పిటిష‌న్‌పై ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు భిన్న‌మైన అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యేలపై స్పీక‌ర్‌ అనర్హత వేటు వేయ‌డాన్ని చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ సమర్థించగా...జస్టిస్ ఎమ్ సుందర్ త‌ప్పుప‌ట్టారు. దీంతో కేసు విసృత ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ చేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. 

madras high court

అయితే ఇలాంటీ కేసుల్లో మామూలుగా న్యాయ‌మూర్తులు బేసి సంఖ్య‌లో ఉండే విధంగా చూస్తారు. కానీ, గురువారం దిన‌క‌ర‌న్ వ‌ర్గ ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ బెంచ్ మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు ఇద్ద‌రు న్యాయ‌మూర్తేలే విచారించ‌డం విశేషం. ఇద్ద‌రిలో చెరో వైపు తీర్పు చెప్ప‌డంతో... కొత్త చిక్కులు వ‌చ్చిన‌ట్లైంది. దీంతో ఇప్పుడున్న ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల‌తో పాటు మ‌రో న్యాయ‌మూర్తిని తీర్పునిచ్చే బెంచ్‌లో చేర్చ‌నున్నారు. అయితే కొత్తగా వ‌చ్చిన న్యాయ‌మూర్తి ఎటూ వైపు తీర్పు ఇస్తాడ‌నేదే ఇప్ప‌డు ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. 

tamil

ఒక‌వైపు ఇప్ప‌టికే ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు చెరోవైపు దిన‌క‌ర‌న్‌, ప‌ళ‌నిస్వామి-ప‌న్నీర్ వ‌ర్గాల‌కు అనుకూలంగా తీర్పు చెప్పినందునా... మూడో న్యాయ‌మూర్తి చెప్ప‌బోయే తీర్పుపైనే త‌మిళ‌నాడు స‌ర్కారు భ‌విత్యం ముడిప‌డి ఉన్న‌ట్లు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌వైపు 18 మంది ఎమ్మెల్యేలపై స్పీక‌ర్ అన‌ర్హ‌త పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టేస్తే...దిన‌క‌ర‌న్ వ‌ర్గానికి నిజంగా పండ‌గే. లేక‌పోతే 18 మంది ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని మూడో న్యాయ‌మూర్తి స‌మ‌ర్థిస్తే ప్ర‌భుత్వానికి ఇప్ప‌ట్లో వ‌చ్చిన ఢోకా ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చిని విశ్లేష‌కులు అంటున్నారు. 

tamil assembly

అయితే త‌మిళ‌నాడు అసెంబ్లీలో ప్ర‌స్తుతం 234 స్థానాలకుగానూ  స్పీకర్ మినహా అధికార అన్నాడీఎంకేకు 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంట్లో దినకరన్‌కు సంబంధించి 18 మంది ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ అన‌ర్హ‌త వేటు వేశారు. ఇక‌ ప్ర‌తి ప‌క్ష డీఎంకేకు 89 మంది, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌కు 8, ఐయూఎంల్‌కు 1 చొప్పున ఎమ్మెల్యేల మ‌ద్ద‌తుంది. జ‌య‌ల‌లిత మ‌ర‌ణించిన ఆర్కే న‌గ‌ర్ నుంచి దిన‌క‌ర‌ణ ఇండిపెండెంట్ అభ్య‌ర్థి గెలుపొంది ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. అయితే త‌మిళ‌నాడు శాస‌న స‌భ‌లో 118 మ్యాజిక్ ఫిగ‌ర్‌గా ఉంది. అయితే ప్ర‌స్తుతం దిన‌క‌రన్ కు హైకోర్టులో అనుకూలంగా తీర్పు వ‌స్తే ఆటోమెటింగ్‌గా అన్నా డీఎంకే మైనార్టీలో ప‌డే చాన్స్ ఉంది. దిన‌క‌ర‌న వ‌ర్గం ఎలాగో అన్నా డీఎంకేకు స‌పోర్ట్ చేయ‌నందునా...ప్ర‌భుత్వం మైనార్టీలో ప‌డిపోయే అవ‌కాశం ఉన్న‌ట్లు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక దాదాపు 100 మంది స‌భ్యుల మ‌ద్ద‌తున్న డీఎంకే స‌ర్కారు ఏర్పాటులో కీల‌క భూమిక కూడా పోషించ‌వ‌చ్చంటున్నారు. 

stalin

అందుకే హైకోర్టులో మూడో న్యాయ‌మూర్తే ఇచ్చే తీర్పే కీల‌క‌మంటున్నారు విశ్లేష‌కులు. బెంచ్‌లో మూడో న్యాయ‌మూర్తి ఇచ్చే జ‌డ్జ్‌మెంట్‌పైనే దిన‌క‌ర‌న్‌, ప‌న్నీర్‌-ప‌ళ‌నీస్వామి, డీఎంకే భ‌విత్యం ఆధార‌ప‌డి ఉందంటున్నారు. చూడాలి మ‌రి...ఒక్క‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వాల‌నే గ‌డ‌గ‌డ‌లాడించిన త‌మిళ రాజ‌కీయాలు ఏ టార్న్ తీసుకోంటాయో...?

tags: key role on 3rd judge judgement in tamil politicsdinakaran sasikala,ups,eps,dmk,aiadmk,chennai,madras,highcourt,shashikala,three judges

Related Post