అభిమానికి గుండెపోటు..

news02 Aug. 7, 2018, 2:29 p.m. political

kRUNnidhi

చెన్నై- (నేషనల్ డెస్క్)- తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించింది. గత శుక్రవారం తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరిన కరుణానిధి.. క్రమంగా కోలుకుంటున్నారని నిన్నటి వరకు డాక్టర్లు చెబుతూ వస్తున్నారు. ఐతే గత అర్ధరాత్రి నుంచి కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు వెల్లడించారు. ఆయన శరీరం వైద్యానికి ఏ మాత్రం స్పందించడం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. మరో 24 గంటలు గడిస్తే గాని కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని కావేరీ ఆస్పత్రి వైద్యులు చెప్పారు.

karunanidhi

ఇక కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందని తెలిసిన పార్టీ కార్యకర్తలు.. అభిమానులు పెద్ద ఎత్తున కావేరీ ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆస్పత్రికి వచ్చి వెళుతున్నారు. కరుణానిధి అనారోగ్యం గురించి తెలిసిన ధర్మపురికి చెందిన ఓ అభిమాని (46) గుండెపోటుతో మరణించాడు. ఇక అభిమానుల తాకిడితో కావేరీ ఆస్పత్రి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

tags: karunanidhi, karunanidhi health, karunanidhi health bulletien, karunanidhi in hospital, doctors on karunanidhi health, kaveri hospital, chennai kaveri hospital

Related Post