పోలీంగ్ కు భారీ ఏర్పాట్లు

news02 Dec. 6, 2018, 8:15 a.m. political

ts election

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. దాదపు రెండు నెలలుగా తెలంగాణ అంతా ఎన్నికల ప్రచారంతో మారుమ్రోగిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాయి. ఇక మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో ఎన్నికల సంఘం పోలీంగ్ కోసం పూర్తి ఏర్పాట్లు చేసింది.  ప్రధాన పక్షాలైన టీఆర్ ఎస్ ప్రచారం బుధవారం గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ సభతో ముగిసింది. చంద్రబాబు, రాహుల్‌గాంధీలు కోదాడలో నిర్వహించిన సభతో మహాకూటమి ప్రచారాన్ని ముగించుకుంది. ఆ తరువాత హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు ప్రజా కూమటి నేతలు. 

election

ఇక రేపు శుక్రవారం పోలింగ్‌ జరగనుండగా, ఈ నెల 11న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 1,821 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్ధులు కొన్నిచోట్ల బలంగా ఉన్నారు.ఇక ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదు తరలిస్తూ కొన్నిచోట్ల నాయకులు పట్టుబడ్డారు. పోలీసుల నిఘా తప్పించుకునేందుకు పైపులు ఇతరత్రా మార్గాల్లో నగదును దాచి తరలిస్తూ కూడా పట్టుబడ్డారు. ఇక పోలింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా చర్యలు చేపట్టింది. 

election

tags: ts election. telangana election, telangana election polling, telangana election arrngements

Related Post