ఎన్నిక‌ల సంఘం కేసీఆర్ కు తొత్తుగా వ్య‌వ‌హ‌రించింది ..!

news02 Dec. 28, 2018, 4:03 p.m. political

uttamkumarreddy

హైద‌రాబాద్ : ఈబీఎం అక్ర‌మాల‌పై తాము ఓవైపు కోర్ట్ కు వెళితే .. రిటర్నింగ్ అధికారులు సాక్షాలు గ‌ల్లంతు చేసేలా .. వీవీ ప్యాడ్‌ స్లిప్పులు  తీసేస్తుంటే వ్యవస్థను ఏమనాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అస‌హ‌నం వ‌య‌క్తం చేశారు. గాంధీభ‌వ‌న్ లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఉత్త‌మ్ .. 1% తేడా ఉన్న ధర్మపురి, కోదాడ, ఇబ్రహీంపట్నంలో ఎందుకు వీవీ ప్యాడ్ స్లిప్స్ లెక్కపెట్టలేదని ఈసీని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. 

uttamkumarreddy

సాయంత్రం 4 గంట‌ల తర్వాత మంచిర్యాలలో నియోజ‌క‌వ‌ర్గంలో వేల సంఖ్యలో ఓట్లు పోల్ అయ్యాయని .. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు భారీ తేడా ఉందని ఉత్తమ్ ఆరోపించారు.అస‌లు వీవీ ప్యాడ్‌ స్లిప్పులు లెక్క‌పెట్ట‌డానికి ఎన్నిక‌ల సంఘానికి ఉన్న అభ్యంత‌ర‌మేమిటో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై ప్ర‌జ‌ల‌కు చాలా అనుమానాలున్నాయ‌ని ఉత్త‌మ్ అన్నారు. ఆ అనుమానాల‌ను నివృత్తి చేయాల్సిన బాధ్య‌త ఈసీదేనన్నారు.

uttamkumarreddy

tags: Uttam Kumar Reddy Fire On EC,uttamkumarreddy,rahulgandhi,janareddy,revanthreddy,shabberali,mallu bhatti vikramarka,soniyagandhi,kcr,ktr,kavitha,harishrao,telangana ec,rajathkumar,ts,telangana govt,ts cm,assembly,congress mlas,trs mlas,mlcs

Related Post