ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్న భట్టి

news02 June 10, 2019, 3:58 p.m. political

bhatti

 

టీఆర్ ఎస్ శాసనసభా పక్షంలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. హైదరాబాద్ నిమ్స్‌ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ఆయనకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ఏఐసీసీ నేతలు భట్టితో ఫోన్‌లో మాట్లాడారు. దీక్షను విరమించాలని వారు భట్టిని కోరారు. అధిష్టానం నేతల విజ్ఞప్తి మేరకు దీక్షను విరమిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన భట్టి.. ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. ఈ అంశంపై ప్రతి ఒక్కరూ చర్చించాలన్న ఆయన.. ప్రజలు తమకు ఇష్టమైన వారిని ఎన్నుకుంటే.. పూర్తి కాలం వారు ఆ గుర్తుపైనే ఉండాలని చెప్పారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచినవారిని మరో పార్టీ డబ్బుతో కొనడం సరికాదన్నారు. 
 

tags: batti called off his hunger strike, batti vikramarka called off his hunger strike, congress leader batti called off his hunger strike, clp leader batti called off his hunger strike, mallu batti called off his hunger strike

Related Post