లోక నాయ‌కుడి ఒంట‌రి పోరు..

news02 Feb. 7, 2019, 10:18 p.m. political

/kamal_hasan_on_parleament_elections

చెన్నై: బీజేపీ ఓడించ‌డానికి ఏపార్టీతోనైనా క‌లిసి అడుగులేస్తామ‌ని  ప్ర‌క‌టించిన లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హ‌స‌న్.. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. త‌మిల్ నాడు, పుదుఛ్చేరి ఫ‌రిదిలోని 40 పార్ల‌మెంట్ ల‌కు ఒంట‌రిగా.. త‌మ పార్టీ మ‌క్క‌ల్ నీది మ‌య్యం (ఎంఎన్ఎం) పోటీ చేస్తుంద‌ని తెలిపారు.  గతంలో తాను చెప్పినట్లుగా ఏ పార్టీతో కలిసేందుకు తాము సిద్ధంగా లేమని వెల్లడించి అంద‌రిని ఆశ్య‌ర్య‌ప‌రిచారు క‌మ‌ల్.   అయితే తాను ఏ లోక్ స‌భ నుండి పోటీ చేస్తాన్న‌దానిపై  స్ప‌ష్ట‌త‌ ఇవ్వ‌కుండా.. ఇంకా స‌ప్పెన్స్ కొన‌సాగించారు క‌మ‌ల్ హ‌స‌న్.. అంత‌కు క‌మ‌ల్ ఎందుకు ఒంట‌రి పోరు చేస్తున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మార్పుకోసం తాను రాజ‌కీయాల్లోకి  ఎంట్రి ఇచ్చిన‌న్న క‌మ‌ల్.. లౌకిక శ‌క్తుల‌తో క‌లిసి ప‌నిచేస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.  అంతేకాదు మ‌రోవైపు దేశ‌ వ్యాప్తంగా బిజేపీ ,కాంగ్రెస్ అనుకూలంగా ప‌ర్టీల పొత్తుల‌తో పార్టీలు జ‌త క‌డుతున్న‌వేళ‌.. క‌మ‌ల్ ఇలా ఎందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. అంటే క‌మ‌ల్ ను ఏపార్టీ..ఆవ్వానించ‌డ‌లేదా.. లేక లోక‌నాయ‌కుడే.. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌డంలేదా.. ? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రాష్ట్రంలోని డిఎంకే కాంగ్రెస్ తో దోస్తీ కోన‌సాగిస్తుంటే.. ఇక ఏఐడిఎంకే బిజేపీకి ద‌గ్గ‌ర ప‌నిచేస్తుండ‌టంతోనే..క‌మ‌ల్ కు ఏపార్టీ నుండి కూడా డోర్స్ ఓప‌న్ లేక‌పోవ‌డంతోనే.. ఈ ఒంట‌రి నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని టాక్. అదే నిజ‌మైతే.. కేసీఆర్ నాయ‌క‌త్వంలోని ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ఒక్క‌టే క‌మ‌ల్ కు మిగిలినా.. దానికి అంత సీన్ ఉండ‌ద‌నే లోక నాయ‌కుడు సింగిల్ పైట్ రెఢీ  అయ్యార‌ని త‌మిల్ తంబిలు అంటున్నారు.

tags: kamal hasan, parleament elections, tamil nadu, mnm ,makkal needi mayyam party, single fight, bjp, congress, aidmk, dmk

Related Post