పిలిచినందుకు కృతజ్ఞతలు

news02 Jan. 30, 2019, 8:18 a.m. political

pawan

తెలుగుదేశం పార్టీ ఈ రోజు నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీ దూరంగా ఉంటున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పవన్‌ కల్యాణ్‌ బహిరంగ లేఖ రాశారు. అఖిలపక్ష సమావేశానికి ఒక రోజు ముందు సాయంత్రం ఆహ్వానిస్తే ఎలా అని పవన్ లేఖలో ప్రశ్నించారు. సరైన ఎజెండా లేకుండా నిర్వహించే మొక్కుబడి భేటీలకు జనసేన దూరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై అఖిలపక్ష సమావేశం పెట్టడం అభినందనీయమని లేఖలో పేర్కొన్నారు. ఏపీ విభజన హామీలకు సంబందించిన అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు జనసేనాని పవన్ కళ్యాణ్.
 

tags: pawan, pawan kalyan, babu. chandra babu, pawan letter to babu, pawan letter to chandra babu, pawan kalyan letter to chandra babu

Related Post