ఇండియన్ పీపుల్ ఫ్రంట్ గా ఏర్పడాలి

news02 Nov. 28, 2018, 8:56 p.m. political

gaddar

ప్రజా కూటమి ఎన్నికల భహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గద్దర్‌కు రాహుల్, చంద్రబాబు అంబేద్కర్ చిత్ర పటాలను బహుమతిగా అందజేశారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గాయమా.. కోట్లాది ప్రాణమా.. భూ తల్లి బిడ్డలు, చిగురించే రెమ్మలు అంటూ ఎప్పటిలాగే తన గళాన్ని విప్పారు. గద్దర్ పాటకు ఏపీ సీఎం చంద్రబాబు ఫిదా అయ్యారు. పాటను వింటూ చంద్రబాబు ముసిముసినవ్వులు చిందించారు.

gaddar
 
ఇక సేవ్ ఇండియా సేవ్ కానిస్టిట్యూషన్ అంటూ బయలుదేరినారంటూ రాహుల్, చంద్రబాబుకు గద్దర్ వందనాలు తెలిపారు. ఈ సందర్బంగా రాహూల్, చంద్రబాబులు చేతులు జోడించి గద్దర్‌కు సమస్కారించారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తుంటే... ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఇద్దరు మహానుభావులు ముందుకొచ్చారని రాహుల్, చంద్రబాబును గద్దర్‌ పొగిడారు. ప్రజాఫ్రంట్ ఇండియన్ పీపుల్ ఫ్రంట్‌గా మారి వీరిద్దరు దేశవ్యాప్తంగా గొప్ప ఉద్యమాన్ని తీసుకురావాలని గద్దర్ కోరుకున్నారు. ఇక  ప్రసంగాన్ని ముగించి వెళుతున్న గద్దర్‌ను రాహుల్ అభినందిస్తే, చంద్రబాబు గుండెలకు హత్తుకోవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
 

tags: gaddar, gaddar about rahul, gaddar about chandra babu, gaddar in khamma meeting, gaddar in prajakutami meeting, gaddar about rahul chandra babu

Related Post