జ‌గ‌న్‌కు కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలే సూచ‌న‌

news02 July 14, 2018, 4:35 p.m. political

radas athawale

హైద‌రాబాద్‌: కొద్ది రోజులుగా బీజేపీ-వైసీపీ పార్టీల‌ మ‌ధ్య ర‌హ‌స్య బంధ‌ముంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఏపీలో వైసీపీకి ద‌గ్గ‌ర అయ్యేందుకే టీడీపీని బీజేపీ దూరంగా పెట్టింద‌నే పుకార్లు కూడా షికారు చేశాయి. ఈనేప‌థ్యం లోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా ప‌లుమార్లు ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో కూడా భేటీ అయి...ఈ అంశానికి మ‌రింత ప్రాముఖ్య‌త కూడా పెంచారు. 

jagan with modi

ఇక ఏన్‌డీఏ త‌ర‌పున రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌, ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా వెంక‌య్య‌నాయుడు నిల‌బ‌డిన‌ప్పుడు కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కోవింద్‌, వెంక‌య్య‌ల‌కు మ‌ద్ద‌తుగా వైసీపీ ఓటేసింది. అంతేకాక ఏపీ ప్ర‌త్యేక హోదా అంశంపై టీడీపీ కేంద్రంపై పోరు జ‌రుపుతుంటే...జ‌గ‌న్ మాత్రం బీజేపీపై పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేయ‌లేదు. అయితే వీట‌న్నింటికీ కార‌ణం వ‌చ్చే సార్వ‌త్రిక‌ల్లో ఎన్నిక‌ల్లో జ‌గ‌న్, బీజేపీతో క‌లిసి ముందుకు వెళ్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. 

ycp bjp

అయితే దీని సంగ‌తి అలా ఉంచితే...ఇప్పుడు తాజాగా బీజేపీ-వైసీపీ ర‌హ‌స్య ఒప్పందంపై వ‌స్తున్న వార్త‌ల‌కు బ‌లం చేకూర్చేలా కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. జగన్‌ను తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్న‌ట్లు తెలిపారు. తమతో కలిస్తే ఆయ‌న‌కు అన్ని ర‌కాల స‌హాయ, స‌హ‌కారాలు అందిస్తామ‌ని చెప్పుకొచ్చారు. అంతేకాక జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అయ్యేందుకు స‌హ‌క‌రిస్తామ‌ని మ‌న‌స్సులోని మాట‌ను బయ‌ట‌పెట్టి అస‌లు విష‌యాన్ని కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు. 

athawale

అయితే కేంద్ర మంత్రి రాందాస్ అథావాలే చేసిన ఈవ్యాఖ్య‌లే...పొలిటిక‌ల్‌గా ఇప్పుడు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఇన్ని రోజులు బీజేపీ-వైసీపీల మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ర‌హ‌స్య ఒప్పందంలో భాగంగానే ఈరెండు పార్టీలు ఏపీలో ముందుకు వెళ్లుతున్నాయ‌ని చ‌ర్చ జ‌రిగింది. అయితే ఇరు పార్టీల మ‌ధ్య పొత్తుపై మాత్రం అటు వైసీపీ కానీ, ఇటు బీజేపీ కానీ క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే కేంద్ర మంత్రి రాందాస్ అథావాలే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యేందుకు స‌హ‌క‌రిస్తామ‌ని చెప్ప‌డంతో...ఈరెండు పార్టీల బంధంపై మ‌రింత క్లారిటీ వ‌చ్చింద‌ని చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అథ‌వాలే స్టేట్‌మెంట్‌తో రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ-వైసీపీ పొత్తు ఖరారైన‌ట్లేన‌ని అంటున్నారు. అందుకే ఆయ‌న ఇలాంటీ వ్యాఖ్య‌లు చేసి...ఇరు పార్టీల మ‌ధ్య గ‌ల ర‌హ‌స్య ఒప్పందానికి తెర దించిన‌ట్లు చెబుతున్నారు. సో...మొత్తానికి ఇన్ని రోజులు బీజేపీ-వైసీపీ మ‌ధ్య గ‌ల బంధంపై వ‌చ్చిన వార్త‌లు అథ‌వాలే వ్యాఖ్య‌ల‌తో నిజ‌మేన‌ని తెలుస్తోంది. 

tags: central minister ramdas athavale comment on ys jaganbjp-ycp alliance,jagan meet with narendra modi,jagan prepare to the alliance with modi,central minister ramdas athawale comments on ycp-bjp alliance,central minister comments on ap cm,aap bjp,bjp ap,bjp apps,bjp app download,bjp ap state leaders,bjp ap state office bearers,bjp ap office bearers,bjp ap president,bjp ap state president,bjp ap state committeebjp ap leaders,bjp ap news,bjp ap mla list 2014,bjp in ap assembly bjp cheated ap,bjp in ap elections,bjp aap facebook,bjp in ap,bjp ap mps,bjp mlc ap,bjp mlas ap,bjp ap mp list,bjp aap manifesto,bjp ap membership,bjp ap office,bjp ap state vice presidentbjp ap unit,bjp ap website,bjp 6 april,,ycp,ycp party,ycp flag,ycp mps,ycp songs,ycp mla,ycp navaratnalu,ycp mla roja,ycp images,ycp party logo,ycp party full form ycp ait,ycpa,ycpac,ycparmia,ycpanthers,yc pang,ycpac box office hours,tcpalm,ycpac calendar,ycpa el paso,is ycp a good,school,ycp bjp,ycp bandh,icp banners,ycp bundh,ycp b

Related Post