కేసీఆర్ పై జేసీ దివాకర్ రెడ్డి ఫైర్

news02 Oct. 6, 2018, 5:20 p.m. political

జేసీ దివాకర్ రెడ్డి

తెలంగాణ ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ ఎస్ భహిరంగ సభల్లో మాట్లాడుతున్న భాషపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కేసీఆర్ మాట్లాడుతున్న తీరుపై నెటిజన్లు దారుణంగా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి లాంటి అత్యున్నత పదవిలో ఉండి కేసీఆర్ ఇలా దిగజారి మాట్లాడటంపై జనం పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. సీఎం పదవిలో ఉన్నవారు హూందాగా వ్యవహరించాలని.. కానీ కేసీఆర్ తాను ముఖ్యమంత్రి అన్న సంగతే మరిచిపోయి మాట్లాడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జేసి

టీఆర్ ఎస్ ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జేసీ కేసీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్న భాషతో కేసీఆర్ తన నెత్తిన తానే చేయి పెట్టుకుంటున్నారని జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. కేసీఆర్ మరీ దిగజారి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించిన జేసీ.. కేసీఆర్ తన భాష మార్చుకోవాలని సూచించారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా హూందాగా మాట్లాడుతారో చూసి నేర్చుకోవాలని హితువు పలికారు జేసీ. చంద్రబాబుకు, కేసీఆర్‌కు చాలా తేడా ఉందన్న జేసీ దివాకర్ రెడ్డి.. మోదీ ఓ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

tags: జేసీ దివాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి కేసీఆర్ పై ఆగ్రహం, jc diwakar reddy, jc fire on kcr, jc diwakar reddy fire on kcr, jc fire on kcr, jc diwakar reddy on kcr

Related Post