కేసీఆర్ ప్ర‌జాస్వామ్యాన్నిఅపహాస్యం చేస్తే సహించబోం ..!

news02 Dec. 16, 2018, 9:36 a.m. political

uttam

హైద‌రాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని బాధ పడొద్దని  పార్టీ శ్రేణుల సూచించారు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. త్వరలో జరిగే పంచాయతీ .. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆయ‌న క్యాడ‌ర్ కు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ గతంలో ఇలాంటి ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నదని .. కాబ‌ట్టి కార్యాక‌ర్త‌లెవ‌రూ అధైర్య‌ప‌డొద్ద‌ని .. ప్రతి ఒక్కరూ ఆత్మస్థయిర్యంతో ముందుకు సాగాలని ఉత్త‌మ్ సూచించారు. జడ్పీటీసీ .. ఎంపీటీసీ .. సింగిల్‌ విండో చైర్మన్‌ ఎన్నికలు త్వరలో రానున్న నేప‌థ్యంలో .. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలని ఆయ‌న తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాలన్న ఆయ‌న‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే సహించబోమన్నారు.

uttam
 
ఏ ఆపద వచ్చినా సంఘటితంగా పోరాడాలని కార్యకర్తలకు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కష్టపడి పనిచేసిన నాయకులను అభినందించిన ఉత్తమ్‌ వారితో ఫొటోలు దిగారు. తన కుటుంబం ప్రజలకు నిస్వార్ధ సేవ చేసేందుకే రాజకీయాల్లో కొనసాగుతోందన్నారు. కాగా ఓటరు జాబితాలో లక్షలాది మంది పేర్లు గల్లంతయ్యాయని .. జాబితా తప్పుల తడకగా ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌ స్వయంగా ఒప్పుకుని క్షమాపణలూ చెప్పారన్నారు. ఓటరు జాబితాను సరి చేయకుండానే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా అంటూప్ర‌శ్నించారు. జాబితాను సరిచేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామంటూ హైకోర్టు నుంచి ప్రభుత్వం .. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకోవాలని పీసీసీ చీఫ్ డిమాండ్‌ చేశారు.
uttam

tags: Uttam Kumar Reddy Hope Full Message to Party Cadder,pcc,telangana congress,uttam,kcr,ktr,trs,gandhibhavan,trs bhavan,aicc,rahul gandhi,soniya gandhi,janareddy,revanth reddy,telangana

Related Post