అవునా..ఈ కార్డ్లులు అప్ప‌డివా..!!

news02 Feb. 3, 2019, 11:10 p.m. political

debit_credi_card_hundred_years_back.

హైద‌రాబాద్ : క‌్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్.. ఇప్పుడు ఎవ‌రి జేబులోనైనా.. ఇవి కామ‌న్.మ‌రీ ..న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన‌.. నోట్ల ర‌ద్దు త‌ర్వాత వీటి వాడ‌కం వెరి కామ‌న్ అయ్యింది. గ‌తంలో క్రెడిట్ కార్డ్ కావాలంటే.. ల‌క్షా తొంబై ప్ర‌శ్నలు వేసివి బ్యాంక్ లు ఇప్పుడు.. పెట్రోల్ బంక్ లో ప్రెట్రోల్ కోసం బండి ఆపినా.. మా కార్డ్ తీసుకోండి బాబు అంటు.. క్రెడిట్ కార్డ్ లు ఇస్తున్నారు. అయితే ఇంద‌తా..ప్రెజెంట్ .. కాని.. ఇవి వందేళ్ళ క్రిత‌మే ఈ  కార్డ్ ల సిస్ట‌మ్ ఉందంటే...  మీరు ఆశ్య‌ర్యంపోవ‌డం ఖాయం. కాని ఇది నిజం..

పూర్వకాలంలో ఒకచోటు నుంచి మరొక చోటుకి ప్రయాణించడానికి బస్సు, బైక్, కార్ల సదుపాయం ఉండేది కాదు. దీంతో గుర్రాలు, గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లనే ప్రజలు ప్రయాణానికి ఉపయోగించేవార‌న్న‌ది మ‌న‌కు తెలిసిందే. ఇక బండ్లు లేని వారు..  దూరప్రాంతాలకు సైతం కూడా నడిచే వెళ్లేవారు. అయితే ఈ ప్రయాణ సమయంలో దొంగలు వారి దగ్గర డబ్బులను దోచుకోకుండా రోమన్, గ్రీకు, యూరోపియన్ ప్రాంతాల్లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల వంటి వ్యవస్థను అమలు చేశారు. ఎవరైనా దూరప్రాంతాలకు వెళ్తుంటే తమ దగ్గర ఉన్న నగదును దగ్గరి బ్యాంకుల్లో (ఒక చోట‌) జమ చేసేవారు. ఆ బ్యాంకులు వాటికి సంబంధించిన ప్రత్యేక ముద్ర ఉండే ఉంగరాన్ని ఇచ్చేవి.

debit_credit_cards_old_system

అలా ప్రయాణం చేసేవారు బసచేసే చోట గానీ, ఏదైనా వస్తువు కొన్నా, ఆహారం తిన్నా ఆ ముద్రతోనే బిల్లు చెల్లించేవారు. పేపర్ పై లేదా క్లాత్, తోలు పట్టీల వంటి వాటిపై బిల్లు మొత్తం రాసి ఆ ముద్ర వేసి సంతకం చేసేవారట‌. వ్యాపారులు ఆ బిల్లులను ఆ బ్యాంకు శాఖల్లో ఇచ్చి డబ్బులు తీసుకొనేవారు.అయితే .. ఇది టెక్నికల్ గా డెబిట్ కార్డు అన్నమాట. అయితే ఒక్కోసారిత‌మ ద‌గ్గ‌ర జమ చేసినదానికంటే ఎక్కువ ఖర్చుపెట్టేవారు ప్రజలు. దీంతో బ్యాంకులు వ్యాపారులందరికీ చెల్లించేసి ఎక్కువైన అమౌంట్ ను సదరు వ్యక్తి నుంచి త‌రువాత వసూలు చేసేవట‌. అంటే ఇది క్రెడిట్ కార్డు. సో.. ఇప్పుడు మ‌నం వాడుతున్న క్రెడిట్, డెబిట్ కార్డ్ లు అప్ప‌డివేన్న‌మాట‌. .. మీరేమంటారు..!

tags: debit cards, credit cards, old system, hundred tears back, greek rooling, roman, uropion, india, demonitaigestion

Related Post