జైల్లోను ఆమె మహారాణే

news02 Jan. 21, 2019, 7:52 a.m. political

shahsikala

బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత సీఎం జయలలిత నిచ్చెలి శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు తేటతెల్లమైంది. ప్రముఖ సామాజికవేత్త ఎన్‌.మూర్తి సమాచార హక్కు చట్టం కింద వేసిన దరఖాస్తు ద్వారా జైలులో శశికళ అనుభవిస్తున్న వసతుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. శశికళకు జైలులో వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారని, అధికారులు ఆమె సౌకర్యాల విషయంలో తప్పుడు ప్రచారం చేశారని సామాజిక వేత్త మూర్తి ఆరోపించారు.

shashikala

జయ స్నేహతురాలు శశికళకు బెంగళూరు జైల్లో ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారనేది పచ్చి నిజమన్న మూర్తి.. ఆమెకు మొదట్లో ఒక్క గది మాత్రమే కేటాయించారని.. ఆ తరువాత ఆమె గది పక్కన ఉన్న నాలుగు గదుల్లో 2017 ఫిబ్రవరి 14 వరకు మహిళా ఖైదీలుండగా... శశికళను జైలుకు తరలించిన తర్వాత వారిని వేరే చోటుకు తరలించి.. మొత్తం ఐదు గదులను శశికళకే కేటాయించారని మూర్తి చెబుతున్నారు. బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని శశికళ కోసం వంట చేయడానికి అధికారులు కేటాయించారట. అంతే కాదు జైలు నిబంధనల్ని తోసిపుచ్చి శశికళను చూడటానికి పెద్ద ఎత్తున విజిటర్స్ ను అనుమతిస్తున్నారట. గతంలోనే శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారని  జైలు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్ రూప ఆరోపించడం సంచలనంగా మారింది. ‌

tags: shashikala, shashikala in jail, shashikala in bangalore jail, shashikala spl in bangalore prison

Related Post