హ‌రీశ్ ను చంపేందుకు కుట్ర జ‌రుగుతోందా ..!

news02 March 10, 2018, 8:25 p.m. political


హైద‌రాబాద్ : టీఆర్‌ఎస్ లో ఉంటే మంత్రి హరీశ్ రావును చంపడం ఖాయమని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. హరీశ్ ను చంపేందుకు అతని కేసీఆర్, కేటీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. ఇప్ప‌టికైనా హరీశ్ రావు టీఆర్‌ఎస్‌ నుంచి బయటపడాలని రేవంత్ సూచించారు. పార్టీ ఫిరాయింపులపై ప్రతిపక్ష నేతల మీద టీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయ‌న ఆరోపించారు. తాను చ‌చ్చేంత వ‌ర‌కు టీఆర్ఎస్ లోనే ఉంటాన‌న్న హ‌రీశ్ వాఖ్య‌ల‌పై స్పందించిన రేవంత్ .. కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డితో హరీశ్ రావు చర్చలు జరిపిన విష‌యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్ లో టీఆర్‌ఎస్ ను విలీనం చేసేందుకు ... వైఎస్‌ సన్నిహితుడితో హరీశ్ రావు చర్చలు జరిపారని .. వైఎస్‌ మృతితో కాంగ్రెస్ లో టీఆర్‌ఎస్‌ విలీనం ఆగిపోయిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను హరీశ్ రావు రెండుసార్లు రహస్యంగా కలిశారని, బీజేపీలోని కీలక వ్యక్తి బంధువుతో హరీశ్ రావు చర్చలు జరిపారని ..  టీఆర్ఎస్ లో హరీశ్ రావు పరిస్థితి ప్రజలకు అర్థమైందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చీలిపోవడం ఖాయమని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. మంత్రి ఈటల రాజేందర్ పై తాను చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడి ఉన్నాన‌న్న రేవంత్ .. ప్రభుత్వం నుంచి ఎవరు చర్చకు వచ్చినా నిరూపించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈటల నిజాయితీపరుడైతే అతనే స్వయంగా వివరణ ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

tags: Revanth Reddy,Congress,Gandhibhavan,TRS,KCR,KTR,Harishrao

Related Post