బీసీ రిజ‌ర్వేష‌న్స్ పై న్యాయ‌పోరాటం ..!

news02 Jan. 2, 2019, 1:22 p.m. political

uttam

హైద‌రాబాద్  వ‌చ్చే లోక్ స‌భ  పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజ‌యం త‌థ్య‌మ‌ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ఓటింగ్ స‌ర‌ళి తేడా ఉంటుంద‌న్న ఆయ‌న .. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని .. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని స్ప‌ష్టం చేశారు. ఇక పంచాయితీ ఎన్నిక‌ల‌పై మాట్లాడిన ఉత్త‌మ్ .. కాంగ్రెస్‌ హయాంలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తే .. కేసీఆర్ 22%కు తగ్గించడం బాధాకరమన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని .. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. 


 uttam
హుజూర్ నగర్ ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానన్నారు. తన నియోజకవర్గంలో గతంలో వేల కోట్ల రూపాయలతో రహదారులు .. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు .. సాగు .. తాగునీటి పథకాలు .. మట్టపల్లి బ్రిడ్జి .. డిగ్రీ కళాశాల .. 100 పడకల ఆస్పత్రి .. మోడల్‌ స్కూల్స్‌ తదితర అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. నిధులు మంజూరై మిగిలిపోయిన పనులను .. ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. పులిచింతల ముంపు బాధితుల పునరావాస కేంద్రాల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడతానన్నారు. 

uttam

tags: Uttam Kuamr Reddy Comment On Parlament Elections,Uttamkumarreddy,Janareddy,Revanthreddy,Bhatti Vikramarka,Gandhibhavan,TRS Bhavan,Rahulgandhi,Soniyagandhi,AICC.kcr,ktr,kavitha,harishrao,tpcc

Related Post