కోర్టు ఉత్త‌ర్వుల‌ను స‌ర్కారు అమ‌లు చేయ‌డం లేద‌ని విన‌తి

news02 June 13, 2018, 10:52 a.m. political

komati reddy,sampath

హైద‌రాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, సంప‌త్‌కుమార్‌ల స‌స్పెన్ష‌న్‌పై ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. కోమ‌టిరెడ్డి, సంప‌త్‌కుమార్‌ల‌ను ఎమ్మెల్యేలుగా గుర్తించాల‌ని హైకోర్టు ఆదేశించిన‌ప్ప‌టికీ...ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో..వారు మ‌ళ్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. తెలంగాణ న్యాయ కార్య‌ద‌ర్శి నిరంజ‌న్‌రావు, అసెంబ్లీ కార్య‌ద‌ర్శి న‌ర్సింహాచార్యులు ఉద్దేశ పూర్వ‌కంగానే కోర్టు ఉత్త‌ర్వులు అమ‌లు చేయ‌డం లేద‌ని పేర్కొన్నారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం వారు హైకోర్టులో ధిక్క‌ర‌ణ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 

sampath,komati reddy

అయితే శాస‌న స‌భ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా మండ‌లి ఛైర్మెన్ స్వామిగౌడ్‌పై హెడ్ ఫోన్స్ విసిరార‌నే కార‌ణంతో వీరి స‌భ్య‌త్వాల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా వెంట‌నే వీరి స్థానాలు ఖాళీ అయిన‌ట్లు..ఆస్థానాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కు ప్ర‌భుత్వం లేఖ కూడా రాసింది. అయితే ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ..ఇద్ద‌రు ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో వీరి పిటిష‌న్ ప‌రిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ జ‌డ్జీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజ‌న్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్ల‌గా...వారి పిటిష‌న్‌ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. 

sampath,komati reddy

అయితే హైకోర్టు డివిజ‌న్ బెంచ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్ప‌టికీ... ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు వారిని ఎమ్మెల్యేలుగా గుర్తించ‌లేదు. దీంతో స‌ర్కారు వైఖ‌రిని నిర‌సిస్తూ...హైకోర్టు ఇచ్చిన ఉత్వ‌ర్వుల‌ను పాటించ‌డం లేద‌ని ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మంగ‌ళ‌వారం హైకోర్టులో కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 

tags: komati reddy venkat reddy,sampath kumar, congress mlas,hyderabad high court,hyderabad high court case status,hyderabad high court judges,hyderabad high court calendar 2018,hyderabad high court judgements,hyderabad high court recruitment 2018,hyderabad high court address,hyderabad high court case status online,hyderabad high court summer holidays 2018,hyderabad high court holidays 2018,hyderabad high court vacation,hyderabad high court website,hyderabad high court advocates,hyderabad high court app,hyderabad high court advocate list,hyderabad high court advocates association,hyderabad high court advocates directory,hyderabad high court advocate, hyderabad high court area,high court hyderabad address,hyderabad high court bar association,a.p. hyderabad high court case status,hyderabad high court building history,hyderabad high court bifurcation,hyderabad high court bench hyderabad,hyderabad high court bail status,hyderabad high court bar association directory,hyderabad high court buses

Related Post