వైసీపీ సైకో పార్టీ

news02 Feb. 4, 2019, 2:21 p.m. political

babu

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైకో పార్టీగా మారిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంద్రప్రదేశ్ కు వచ్చే పరిశ్రమలను అడ్డుకుంటూ.. పెట్టుబడులు రాకుండా కుట్రలు చేస్తున్నారని జగన్‌ పై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజలు కష్టాల్లో ఉండాలన్నదే సైకో వైసీపీ ధోరణి అని చంద్రబాబు మండిపడ్డారు. పింఛన్ల సభలు, పసుపు-కుంకుమ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను భగ్నం చేయడం జగన్ శాడిజానికి నిదర్శనమని ముఖ్యమంత్రి విమర్శించారు. బీజేపీ యేతర పార్టీలన్నీ కలిసి ఈవీఎంలపై ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని ముందుగా నిర్ణయించాయని.. ఇది తెలిసి వైసీపీ అధినేత జగన్ హడావుడిగా దిల్లీ వెళ్ళారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. మోదీ కనుసన్నల్లో జగన్ ఈసీని కలిసి ఏదో ఫిర్యాదు అని నాటకమాడుతున్నారని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.

tags: babu, chandra babu, babu fire on jagan, chandra babu fire on jagan, chandra babu comments on ycp, chandra babu comments on jagan

Related Post