కేసీఆర్ ను షేక్ చేస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్

news02 April 4, 2018, 11:01 a.m. political

Congress bus yatra

టీఆర్ఎస్ లో కాంగ్రెస్ బస్సు యాత్ర గుబులు పుట్టిస్తోంది. రెండో దఫా బస్సు యాత్రకు తండోపతండాలుగా కదిలి వస్తున్న జనంతో టీఆర్ ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ సభలకు ఎందుకు ఇంత మంది జనం వస్తున్నారంటూ విచారణ మొదలుపెట్టారు గులాబీ నేతలు. కాంగ్రెస్ సభలపై ఇంటలిజెన్స్ ఇస్తున్న సమాచారంతో ఎంక్వైరీ మొదలుపెట్టారు.

Congress bus tour

దక్షిణ తెలంగాణ లో జరిగిన మొదటి దశ కాంగ్రెస్ బస్సు యాత్రకు ప్రజలనుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కాని టీఆర్ ఎస్ బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ సభలె సక్పెస్ కావటంపై టీఆర్ ఎస్ నేతలు ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ సభకువేలాది మంది జనం రావటంపై టీఆర్ ఎస్ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

Congress tour

ఏప్రిల్ ఒకటో తేదీన రామగుండలో కాంగ్రెస్ రెండో దఫా బస్సు యాత్ర మొదలైంది. ఈ మీటింగ్ 8 వేల నుంచి 10వేల మంది కాంగ్రెస్ సభకు హాజరయినట్లు టీఆర్ ఎస్ అంచనా వేస్తోంది. ఏప్రిల్ రెండో తేదీన పెద్దపల్లిలో జరిగిన సభకు 15 నుంచి 17 వేల మంది జనం హారయ్యారని ప్రభుత్వానికి ఇంటలీజెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడో తేదీన భూపాలపల్లి లో జరిగిన సభకు 20నుంచి 22 వేల మంది హాజరైనట్లు టీఆర్ ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మంథని సభకు 30 వేల మంది హాజరైనట్లు ప్రభుత్వానికి రిపోర్టులు ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ సభలకు ఇంత మంది ఎలా వస్తున్నారు .. డబ్బులు పెట్టి తీసుకువస్తున్నారా.. లేక ప్రభుత్వం పై వ్యతిరేఖతతో స్వచ్చందంగా వస్తున్నారా అనే చర్చ టీఆర్ ఎస్ లో జరగుతోంది. స్థానిక ఎమ్మల్యేపై ఉన్న వ్యతిరేఖత కూడా కాంగ్రెస్ సభలకు జనం రావడానికి దోహదపడుతోందన్న అనుమానాలు టీఆర్ ఎస్ నేతల్లో ఉన్నాయి. కాంగ్రెస్ బస్సు యాత్ర జరిగే నియోజకవర్గాల్లో పార్టీ నేతలను అధినేత కేసీఆర్ అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది.    

tags: Congress bus yatra , utham bus tour,

Related Post