నాది " ప్రేమ బాట‌"..

news02 May 12, 2019, 5:31 p.m. political

/rahul_gandhi_costing_vote

సార్వత్రిక ఎన్నికల్లో చివరికి ప్రేమే విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ ఏఐసిసి అధయక్షులు రాహూల్ గాంధీ అన్నారు. దిల్లీలోని ఔరంగజేబ్‌ రోడ్ లోని ఎన్‌పీ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో రాహూల్ ఓటు వేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన రాహూల్..  దేశంలో పలు అంశాలపై ఈ ఎన్నికలు జరుగుతున్నాయని.. నిరుద్యోగం, రైతుల సమస్యలు, నోట్లరద్దు, రఫేల్‌ తదితర అంశాలపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారంలో విద్వేషాన్నే ఆయుధంగా చేసుకున్నారని విమర్శించారు. కానీ తాము ప్రేమతోనే ముందుకువెళ్తున్నామన్న రాహూల్.. ద్వేషంపై ప్రేమే విజయం సాధిస్తుందని తాను నమ్ముతున్నానని అన్నారు.

tags: rahul gandhi, delhi, vote costing, pm modi, parleament elections, aicc, president,

Related Post