24 గంట‌ల విద్యుత్ లో కుంభ‌కోణం .. !

news02 April 16, 2018, 12:21 p.m. political

revanthreddy

సూర్యాపేట : తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ వెలుగుల వెనక భారీ కుంభకోణం ఉందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం సూర్యాపేటలో ప‌ర్య‌టించిన ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గతంలో ఉన్న విద్యుత్‌ ఇబ్బందులను ఆసరాగా చేసుకొని న‌ష్టాల్లో ఉన్న ల్యాంకో .. మీనాక్షి .. మై హొమ్ కంపనీలల్లో  విద్యుత్ కొనుగోలు చేసి ఆయా సంస్థ‌ల‌కు ల‌బ్ది చేకూరుస్తూ .. 24గంటల విద్యుత్ అంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని  రేవంత్ ఆరోపించారు. ప్ర‌వేట్ సంస్థ‌ల‌కు ల‌బ్ద చేకూర్చేందుకు కేసీఆర్ వాటి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తూ క‌మీష‌న్లు దండుకుంటున్నాడ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కమీషన్ల పనులకే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం  ఇస్తోంద‌ని రేవంత్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 

revanthreddy fire on jagadeshwar reddy

2016-17 విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో 5832 కోట్ల అదనపు చెల్లింపులు జరిగాయని కాగ్‌ కూడా అక్షింతలు వేసిన విష‌యాన్ని రేవంత్ ప్ర‌స్తావించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సూర్యాపేటలో నిర్మాణం చేస్తున్న కలెక్టరేట్ ను మార్చి వేస్తామన్నారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన స్థలంలోనే కలెక్టరేట్‌ నిర్మిస్తామన్నారు రేవంత్ రెడ్డి. విద్యుత్ కొనుగోళ్లు .. దళితులకు 3ఎకరాల భూపంపిణీ అంశాలలో జగదీష్ రెడ్డి అవినీతికి పాల్ప‌డుతున్నాడ‌ని రేవంత్ అన్నారు . జగదీష్ రెడ్డి కి చెందిన 2 శాఖలలో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కాగ్ నిర్ధారించింద‌న్న రేవంత్ నైతిక బాద్య‌త వ‌హించి  జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి రాజీనామా చెయ్యాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

revanth reddy with jagadeshwar reddy

Related Post