ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకున్న ప్రియాంక ప్ర‌సంగం ..!

news02 March 12, 2019, 6:20 p.m. political

PRIYANKA GANDHI

గుజ‌రాత్ : క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ త‌న  తొలి ప్రసంగంలోనే నరేంద్ర మోదీ పై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తూ .. వారి భావోద్వాగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనుకుంటున్నారని విమ‌ర్శ‌లు గుప్పించారు. మంగళవారం గుజరాత్ లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో ప్రియాంక ఏఐసీసీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి హోదాలో పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో పనికిమాలిన అంశాలకు బదులు దేశాన్ని పట్టిపీడుస్తున్న కీలక అంశాలను ప్రజలు లేవనెత్తాలని ఆమె పిలుపునిచ్చారు.

PRIYANKA GANDHI
 
ఈ ఎన్నికల్లో కీలకమైన అంశాలోమిటో మీరు ఆలోచించాలన్న ప్రియాంక .. ఈ ఎన్నికల్లో ఏయే అంశాలను మీరు ఎంచుకోవాలనుకుంటున్నారని స‌భ‌కు హ‌జ‌రైన ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు. మీరు మీ భవిష్యత్తును ఎంచుకోవాల్సి ఉంటుంది .. అనవసరమైన విషయాలు లేవనెత్తాలి .. మనం ముందుకు ఎలా వెళ్లాలి .. మీకు ఉద్యోగాలు ఎలా వస్తాయి .. మహిళలకు భద్రత ఎలా .. రైతులకు ఏమి చేయాలి .. ఇవే ఎన్నికల అంశాలు కావాలని ప్రజలకు ప్రియాంక సూచించారు. ప్రేమ, సామరస్యం, సౌభ్రాతృత్వం వంటివి ఈ దేశానికి పునాదులనీ, అయితే ఇవాళ దేశంలో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుండటం విచారకరమని ఆమె అన్నారు. దేశంలో విద్వేష గాలులు వీస్తున్నాయని ద్వ‌జ‌మెత్తారు. 

PRIYANKA GANDHI

tags: PRIYANKA GANDHI FIRE ON NARENDRA MODI,PRIYANKA GANDHI,RAHUL GANDHI,SONIYA GANDHI,NARENDRA MODI,AMITH SHA,BJP,CONGRESS,AICC MEETING,GUJARATH,CONGRESS CAMPAIN,PRIYANKA GANDHI ELECTION CAMPAIN,UTTARPRADESH CONGRESS CAMPAIN

Related Post