మోదీ సర్కారుపై పద్మావతి ఫైర్ ..!

news02 Aug. 18, 2019, 10:39 a.m. political

Padmavathi

హైదరాబాద్ : దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఆరోపించారు. లౌకిక విధానంతో జరగాల్సిన పాలన నేడు మత పరమైన భావాలతో పాలన సాగడం దురదృష్టకరమన్నారు. రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్బంగా గాంధీభవన్ ప్రకాశం హాల్ లో నేషనల్ సలిడారిటీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. దేశంలో మన సంస్కృతి .. సంప్రదాయాలు .. తిండి .. బట్ట అన్నింటిపైన ఆంక్షలు ఉంటున్నాయని పద్మావతి ఆవేదన వ్యక్తంచేశారు.

Padmavathi

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే దేశంలో అన్ని మతాల వారికి సరైన స్వేచ్ఛ లభించిందన్న పద్మావతి .. రాజీవ్ గాంధీ కలలు కన్న పాలన కు విరుద్ధంగా పాలన సాగడం బాధ కలిగిస్తుందన్నారు. రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవాన్ని తెచ్చారన్న ఆమె .. నేడు డ్రైవర్ లేకుండా కార్లు తిప్పగలిగే సామర్థ్యం వచ్చిందంటే అది రాజీవ్ గాంధీ ఘనతనే అన్నారు. దేశంలో ఇంత పెద్దఎత్తున సమాచార ..సాంకేతిక విప్లవానికి బాటలు వేసింది .. ముందు చూపుతో రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలే కారణమని పద్మావతి అన్నారు. మనం ఎవ్వరిమైన ముందు భారతీయులమనే భావన ఉండాలన్న ఆమె .. అదే దేశ సమగ్రతకు ముఖ్యమన్నారు.

Padmavathi

tags: KODADA EX MLA PADMAVATHI,UTTAM PADMAVATHI,UTTAM KUMAR REDDY WIFE PADMAVATHI,UTTAM PADMAVATHI FIRE ON NARENDRA MODI GOVERNMENT,RAJEEV GANDHI GOVT, SONIA GANDHI, RAHUL GANDHI, PRIYANKA GANDHI, GANDHIBHAVAN,PRAKASHAM HALL,CONGRESS MEETINGS,KCR,KTR,UTTAM KUMAR REDDY, REVANTH REDDY, BHATTI VIKRAMARKA,JANAREDDY,SHABBER ALI,TPCC,AICC

Related Post