కేసీఆర్ కు ఉత్తమ్ భహిరంగ లేఖ

news02 Oct. 10, 2018, 9:33 p.m. political

uttam

తెలంగాణ ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి భహిరంగ లేఖ రాశారు. మీ మేనల్లుడు హరీష్ రావు తనకు రాసిన భహిరంగ లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తేల్చి చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానంటూ లేఖను ప్రారంభించిన ఉత్తమ్.. పలు అంశాలను లేవనెత్తారు. 2004లో టీఆర్ ఎస్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆయన గుర్తు చేశారు. 2009లో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని చెప్పి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని కేసీఆర్ చెప్పిమ మాటను ఉత్తమ్ గుర్తు చేశారు. మరిప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించిన ఉత్తమ్.. మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు కానిది.. ఇప్పుడు టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ ఎలా అవుతుందని మండిపడ్డారు. గతంలో తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన సీపీఎం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీకు శరం లేదా అని కేసీఆర్ ను ఘాటుగా ప్రశ్నించారు ఉత్తమ్. అందుకే టీడీపీతో కాంగ్రెస్ పొత్తు గురించి ప్రశ్నించే నైతికత టీఆర్ ఎస్ పార్టీకి లేదని లేఖలో తేల్చి చెప్పారు పీసిసి చీఫ్. 

uttam

ఇక బీజేపీతో అంటకాగుతున్న టీఆర్ ఎస్.. విభజన హామీలు ఎందుకు అమలు చేయలేకపోయారని ఉత్తమ్ కేసీఆర్ పై ఫైర్ అయ్యాారు. తెలంగాణను మేమే సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న మీరు.. ఏపీలో కలిసిన ఏడు మండలాల గురించి ఎందుకు పోరాటం చేయడం లేదని కేసీఆర్ ను లేఖలో నిలదీశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తనకు హరీష్ రావు రాసిన లేఖతో తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని వ్యాఖ్యానించిన పీసిసి చీఫ్.. హరీష్ సనకు సంధించిన 12ప్రశ్నల్లో కనీసం ఒక్క ప్రశ్న కూడా తెలంగాణ సమాజానికి పనికివచ్చేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్న వాస్తవాన్ని చెప్పినందుకు మాత్రం హరీష్ కు కృతజ్ఞతలు చెప్పారు. 

uttam

హ‌రీష్ రావు లేఖ ద్వారా మీరు ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పిన  టిఆర్ ఎస్ వంద సీట్లు అనే క‌ల చెదిరిపోయిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. మీరు ఇక ఫామ్ హౌజ్‌కు ప‌రిమిత‌మ‌య్యే స‌మ‌యం వ‌చ్చిందని కేసీఆర్ కు సూటిగా చెప్పేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స్వేచ్చ రాబోతోందన్న ఆయన... ఒక ప్ర‌జాస్వామిక, ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌బోతోందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపు, టిఆర్ఎస్ ఓట‌మిని మీరు ముందుగానే అంగీక‌రించినందుకు కేసీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు ఉత్తమ్. ఇక ఎన్నికల్లో పొత్తులు, కూటములు సహజం అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాసిపెట్టుకో కేసీఆర్.. ఈ ఎన్నికల్లో మా గెలుపు.. మీ ఓటమి ఖాయం అని ఆత్మస్తైర్యంతో కేసీఆర్ కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

uttam

uttam

tags: uttam, uttam open letter, uttam open letter to kcr, pcc chief uttam open letter to kcr, uttam kumar reddy open letter to kcr, uttam letter to kcr, uttam open letter to cm kcr, uttam fire eon kcr in open letter

Related Post