ఏ మొహం పెట్టుకొని వచ్చారని ప్రశ్న

news02 Oct. 11, 2018, 2:39 p.m. political

ట్రెస్

ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టీఆర్ ఎస్ నేతలకు ఎక్కడికక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గ్రామస్థులు టీఆర్ ఎస్ నేతలను తరిమి తరిమి కొడుతున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నడూ తమ గ్రామం మొహం చూడని టీఆర్ ఎస్ నేతలు.. ఇప్పుడెందుకు వచ్చారని నిలదీస్తున్నారు. ఇన్నాళ్లు తమ కష్ట సుఖాలు.. తమ గ్రామ అభివృద్ది పట్టించుకోని వారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారని టీఆర్ ఎస్ నేతలపై మండిపడుతున్నారు ప్రజలు. దీంతో టీఆర్ ఎస్ నేతలు ఎన్నికల ప్రచారానికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. తాజాగా షాద్ నగర్ తాజా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు చేదు అనుభవం ఎదురైంది. షాద్ నగర్ నియోజకవర్గంలోని గంట్లవెల్లి దేవుని బండ తండాలో చాలా కాలంగా త్రాగు నీరు లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్రెస్

ఇన్నాళ్లు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో పాటు ప్రజా ప్రతినిధులకు ఎంతలా మొగపెట్టుకున్నా ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదు. టీఆర్ ఎస్ పార్టీ జడ్పీటీసీ అరుణ సొంత గ్రామమైనా కూడా ఈ గ్రామంలో ఇప్పటి వరకు త్రాగు నీటి సమస్యను తీర్చలేకపోయారని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో తమను ఎవ్వరు పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రచారం కోసం వచ్చిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రచార రధాన్ని అడ్డుకున్నారు. కొపంతో అంజయ్య యాదవ్ రధాన్ని ద్వంసం చేశారు. మళ్లీ తమ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి రావద్దని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.

tags: టీఆరెస్ నేతలపై జనం ఆగ్రహం, people fire on trs, people fire on trs leaders, people fire on kcr, people fire on trs party

Related Post