అంత్యక్రియలు ఎక్కడ..

news02 Aug. 8, 2018, 7:47 a.m. political

karunanidhi dead

చెన్నై(నేషనల్ డెస్క్)- తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత దివంగత కరుణానిధి అంత్యక్రియలపై వివాదం కొనసాగుతోంది. ఆయన అంత్యక్రియలు చేయాల్సిన స్థలం విషయంలో డీఎంకేకు, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం కనసాగుతోంది. కరుణానిధి అంత్యక్రియల కోసం చెన్నై మెరీనా బీచ్‌లో స్థలమివ్వాలన్న డీఎంకే విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై డీఎంకే హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ పై గత అర్ధరాత్రి న్యాయమూర్తులు విచారించి.. ఈ రోజు ఉదయం 8 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది హైకోర్టు. 

karunanidhi

ఇక హైకోర్టులో వాదనల సందర్బంగా.. ఇతర నేతల అంత్యక్రియలకు స్థలం ఇచ్చినట్టుగానే 13 సార్లు ఎమ్మెల్యేగా.. 5సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధికి ఎందుకివ్వకూడదని ప్రశ్నించింది. మాజీ ముఖ్యమంత్రులు సి.రాజగోపాలాచారి, కె.కామరాజ్‌ల స్మారకాల పక్కన భూమి ఇస్తామని అన్నా డీఎంకే సర్కార్ స్పష్టం చేసింది. కలైంజర్ కరుణానిధి రాష్ట్రానికి అందించిన సుదీర్ఘ సేవలను దృష్టిలో ఉంచుకొని ఆయన అంత్యక్రియలకు మెరీనాబీచ్‌లో అన్నాదురై సమాధి ప్రాంగణంలో చోటు ఇవ్వాలని స్టాలిన్‌ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామికి లేఖ రాశారు. 

karunanidhi

ఇక మద్రాస్‌ హైకోర్టులో అనేక కేసులు పెండింగ్‌లో ఉండటం, న్యాయపరమైన సమస్యల కారణంగా మెరినా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలకు అనుమతి ఇవ్వలేమని సీఎం పళని స్వామి స్పష్టం చేశారు. మరోవైపు గతంలో ఎం.జి.రామచంద్రన్‌, జయలలితలకు మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు జరిగాయని... వారి స్మారకాలనూ ఏర్పాటుచేశారని... మరి ఇప్పుడు కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో స్థలమివ్వడానికి అభ్యంతరమేంటని డీఎంకే ప్రశ్నిస్తోంది. ఈమేరకు పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

tags: karunanidhi, karunanidhi dead, karunanidhi funeral, karunanidhi dead body, court on karunanidhi funeral, hi court on karunanidhi funeral,

Related Post