తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

news02 Oct. 15, 2018, 8:46 p.m. political

uttam

తెలంగాణలో కేసీఆర్ దగుల్బాజీ ప్రభుత్వాన్ని నడిపించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈనెల 20న ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నేపధ్యంలో ఆయన పర్యటన చేసే ప్రాంతాల్లో ఏర్పాట్లను ఉత్తమ్ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అదిలాబాద్ జిల్లా బైంసా, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో రాహూల్ పాల్గొనే భహిరంగ సభా స్థలాలను పరిశీలించారు. రాహూల్ పర్యటను విజయవంతం చేయడానికి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 

uttam

ఈ సందర్బంగా మాట్లాడిన ఉత్తమ్.. కేసీఆర్ పై  ఫైర్ అయ్యారు. త్వరలోనే టీఆర్ ఎస్ పార్టీ కుప్పకూలబోతోందని చెప్పిన ఉత్తమ్.. చివపకు టీఆర్ ఎస్ పార్టీలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే మిగులుతుందని అన్నారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు. ప్రధాని మోదీకి కేసీఆర్ చెంచాలా మారారని విమర్శించారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఈనెల 20న తెలంగాణ పర్యటనకు వస్తున్న ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధి.. హైదరాబాద్ తో పాటు.. బైంసా, కామారెడ్డిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

tags: uttam, pcc chief uttam, uttam monitoring rahul tour shedule, uttam visit bhaimsa rahul meeting place, uttam visit kamareddy rahul meeting place

Related Post