మోడీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోంది

news02 April 10, 2019, 7:09 p.m. political

Chandrababu met ecఅమరావతి : ఎన్నికల సంఘం పని తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీ సచివాలయానికి వచ్చిన చంద్రబాబు.. ఈసీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సీఈవో ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా జరపాలని కోరారు. ఎన్నికల సంఘం పనితీరుపై నిరసన తెలుపుతూ సీఈవో ద్వివేదికి.. 9 పేజీల లేఖ, పెన్ డ్రైవ్‌ను చంద్రబాబుఇచ్చారు. విజయసాయిరెడ్డి, వైఎస్ భారతికి సంబంధించిన కొన్ని ఆడియో టేప్‌లను కూడా ద్వివేదికి అందించారు.

Chandrababu met ecఏపీలో ఎన్నికలు కొందరికి ఏకపక్షం చేయాలని చూస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. 40 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు. పశ్చిమ బెంగాల్ బదిలీ చేసిన అధికారి కేకే శర్మను ఏపీకి ఎలా తెస్తారని బాబు ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకుల మీదే ఎందుకు దాడులు చేస్తున్నారు..? ఒంగోలు ఎస్పీని ఎందుకు బదిలీ చేశారు? డీజీ ఇంటెలిజెన్స్‌ను ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. ఏపీలో అధికారుల బదిలీ వెనుక కుట్ర ఉందన్నారు చంద్రబాబు. మొదట ఒకరు ఫిర్యాదు చేస్తారు.. తర్వాత ఈసీ చర్యలు తీసుకుంటోందని ఆక్షేపించారు. అన్నీ కుట్ర ప్రకారం జరుగుతున్నాయని నిరసన వ్యక్తం చేస్తూ ఈసీని కలిసారు చంద్రబాబు.

Chandrababu met ecస్వయంప్రతిపత్తి సంస్థ కేంద్రానికి కొమ్ముకాయడం సరికాదంటున్న చంద్రబాబు .. ఐటీ సోదాలు, అధికారుల బదిలీలపై సీరియస్‌ అయ్యారు. ఇక ఈసీ తీరుకు నిరసనగా ఏపీ సీఈవో ఛాంబర్‌ ముందు నిరసనకు దిగారు చంద్రబాబు. ఈసీ చాంబర్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కలిసి నిరసనలో పలువురు నేతలు పాల్గొన్నారు.

tags: CHANDRABABU, ELECTION COMMISSION,AP CM, CHANDRABABU MET EC, CHANDRABABU DHARNA AT EC CHAMBER,YS JAGAN MOHAN REDDY,MODI,KCR,TDP,YSRCP, JANASENA,BJP, CONGRESS

Related Post