కాంగ్రెస్ లోకి భారీగా వలసలు..

news02 Oct. 9, 2018, 7:07 p.m. political

uttam

మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి గత ఎన్నికల్లో టీఆర్ ఎస్ రెబల్ గా పోటీ చేసిన ఇబ్రహీం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలి సమక్షంలో ఇబ్రహీం కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన పీసిసి చీఫ్ ఉత్తమ్.. కేసీఆర్ ముస్లిం ద్రోహి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ ఏజెంట్ అని చెప్పిన ఆయన.. టీఆర్ ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు బడ్జెట్ లో 15శాతం నిధులు కెటాయిస్తే.. ఇప్పుడు కేవలం 0.1 శాతమ మాత్రమే కెటాయించిన ఘనుడు కేసీఆర్ అని ఉత్తమ్ మండిపడ్డారు. మక్కా మసీదు పెలుళ్ల నిందితులను కోర్టు నిర్ధోషులుగా తేల్చినా.. కేసీఆర్ సర్కార్ సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదని పీసిసి చీఫ్ ప్రశ్నించారు. 

uttam

ఆలేరు ఎన్ కౌంటర్ లో ఐదు మంది అమాయకులైన ముస్లిం యువకులు చిపోతే దానికి సంబందించిన రిపోర్ట్ ఇంతవరకు రాలేదని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. గతంలో ముస్లిం మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని ఆయన గుర్తు చేశారు. కానీ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాయమాటలు చెప్పిన కేసీఆర్.. దానిపై ఇప్పుడు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ముస్లింల కోసం ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని చెప్పిన ఉత్తమ్.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముస్లింలను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. ఇక టీఆర్ ఎస్ రెబల్ ఇబ్రహీంతో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు ఉత్తమ్, షబ్బీర్ ఆలి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

tags: uttam, uttam kumar reddy, uttam fire on trs, uttam fire on kcr, trs leaders joined in congress, trs leader ibrahim joined in congress, trs leaders intrest join in congress

Related Post