ఓటుకు నోటు కేసు కదలిక వెనుక మోడీ ఉన్నాడు

news02 May 8, 2018, 9:35 p.m. political

Revanth reddy vote for note

హైదరాబాద్ : నోటుకు ఓటు కేసు కదిలికపై ఎమ్మేల్యే రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోడీ అదేశాలతోనే సీఎం కేసీఆర్ నోటుకు ఓటు కేసును తెరపైకి తెచ్చారని ఆరోపించారు రేవంత్.తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న వేల కోట్ల లో అవినీతిని బస్సు యాత్ర ద్వారా బయటపెడుతున్నందుకే ప్రతి పక్ష నాయకుల పైన కేసులు బయటకు తీస్తున్నారని ఆరోపించారు. ఏసీబీ కి సబంధించి 2016 సంవత్సరంలో 125మంది మీద సరైన సమాచారం లేదు అని కేసులు ఎందుకు ఉపసంహరించుకున్నారో కేసీఆర్ ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు.

Revanth reddy note for vote

అవినీతి పరులను కాపాడటంలో తెలంగాణ దేశంలోనే ముందుందని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ తన దగ్గర బంధువైనా నిమ్స్ ఒక విభాగ అధిపతి శేషగిరిరావు అవినీతి కేసు నుండి తప్పించారని ఆరోపించారు. మరో బంధువు సంజీవరావు ఏసీపీ కూకట్ పల్లి అధికారి కోట్ల రూపాయల అవినీతి చేసిన కేసును కూడా తప్పించి ఉద్యోగంలోకి తీసుకున్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ బంధు వర్గానికి చెందిన వారు ఎవరైనా ఎంత అవినీతి చేసినా వారిపై కేసులు పెట్టకుండా కేసీఆర్ తప్పిస్తున్నారని అన్నారు.ఇలా మొత్తం 125 కేసులు ఉపసంహరణ చేశారని రేవంత్ ఆరోపించారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం టీఆరెస్ లంచం ఇస్తాను అని ఫోన్ లోమాట్లాడుతున్న ఆడియో టేపులు బయటికి వచ్చినా ఇంతవరకు చర్య తీసుకోలేదని ఆరోపించారు రేవంత్. కేసీఆర్ నీ కొడుకు కేటీఆర్2శాతం లంచం తీసుకోమన్నారు అని మున్సిపల్ చైర్మన్ చెప్తే దానిపైన ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. కేటీఆర్ శాఖలోని టి హబ్ ల్ నిర్మాణానికి సంబంధించిన విషయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినా దాని పై ఎందుకు విచారణ చేయలేదని అడిగారు. నిన్నటి సమీక్షలో రాజకీయ కోణం స్పష్టంగా కనబడిందని అన్నారు. ఆంద్రప్రదేశ్ కు నష్టం చేసిన బీజేపీ ని ఓడించండి అని చంద్రబాబు చెప్పడంతో మోడీ సూచనతో కేసులు రీ ఓపెన్ చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.కేసీఆర్ నీ ఉడత ఉఉపులకు భయపడే వారు ఎవరు లేరని అన్నారు.

Related Post