ట్విట్టర్ లో చంద్రబాబుకు కేటీఆర్ కౌంటర్

news02 March 14, 2018, 1:16 p.m. political

ట్విట్టర్ వేదికగా తెలంగాణ అంశాన్ని లేవనెత్తిన ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లోనే సమాధానం ఇచ్చారు.  సెంటిమెంట్‌కు నిధులు రావని కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ అన్న మాటలకు సమాధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని సెంటిమెంటుతోనే ఇచ్చారని వ్యాఖ్యానిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

దీనిపై స్పందించిన కేటీఆర్ ‘ మీ రాష్ట్ర హక్కుల కోసం పోరాడటంలో తప్పులేదు, కానీ తెలంగాణ ప్రజల పోరాటాన్ని, త్యాగాలను తక్కువ చేసి మాట్లాడొద్దు. మేము ప్యాకేజీల కోసం రాష్ట్రాన్ని కోరుకోలేదు. అది మా హక్కు’అంటూ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ రిప్లైకి చంద్రబాబు మళ్లీ ట్వీట్ చేస్తారా? లేక మౌనంగా ఊరుకుంటారా? వేచి చూడాలి.

 

 

tags: ktr, twitter, chandrababu, telangana, sentiment

Related Post