సాక్షాధారాలతో బయటపెట్టిన ఉత్తమ్..

news02 Oct. 5, 2018, 7:29 p.m. political

uttam

ప్రత్యేక తెలంగాణ కోసం 2009లో కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష అంతా బూటకమని తేల్చేశారు పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిరాహార దీక్షలో కేసీఆర్ కేవలం గడ్డం మాత్రమే పెంచుకున్నాడని.. ఎప్పటికప్పుడు అవసరమైన ఫ్లూయిడ్స్ ను తీసుకున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు తగిన సాక్షాధారాలను బయటపెట్టారు ఉత్తమ్. కేసీఆర్ నిమ్స్ ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేసిన సమయంలో ఆయన ట్రీట్ మెంట్ కు సంబందించిన రిపోర్ట్స్ ను ఉత్తమ్ భహిర్గతం చేశారు. అందులో కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో ఆయనకు ఫ్లూయిడ్స్ రూపంలో ఆహారాన్ని అందించినట్లు స్పష్టంగా ఉంది. కాబట్టి తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది కేవలం దొంగ దీక్ష అని ఉత్తమ్ తేల్చిచెప్పారు. 

uttam

ఇలాంటి దొంగ దీక్షలు చేసి.. తనవల్లే తెలంగాణ వచ్చిందని చెప్పేందుకు కేసీఆర్ కు సిగ్గూ.. శరం ఉండాలని మండిపడ్డారు. కేసీఆర్ ను బట్టేబాజ్ అని ఖచ్చితంగా అంటామని స్పష్టం చేసిన ఉత్తమ్.. ప్రజలను మోసం చేసన కేసీఆర్ బట్టేబాజ్ కాక మరేమింటని ప్రశ్నించారు.  తాను దేశం కోసం బార్టర్ లో యుధ్ద విమానాలకు పైలెట్ గా పనిచేసే సమయంలో.. కేసీఆర్ దొంగ పాస్ పోర్ట్ ఏజెంట్ గా పనిచేశాడని ఫైర్ అయ్యారు ఉత్తమ్. ఢిల్లీ  ఎయిర్ పోర్ట్ లో కేసీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేస్తే అప్పటి ఎంపీ ఎమ్మెస్సార్  విడిపించాడని ఉత్తమ్ గుర్తు చేశారు.

uttam 

జాతీయ నాయకుల జయంతి రోజున కనీసం వారికి పూల మాల వేసే తీరిక కూడా కేసీఆర్ కు  లేదన్న ఉత్తమ్.. సిగ్గు లేని జన్మ కేసీఆర్ దని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మాకేందుకన్న కేసీఆర్.. ఇప్పుడు మహాకూటమిని చూసి భయపడుతున్నాడని వ్యాఖ్యానించారు ఉత్తమ్.  కేసీఆర్ మొదనష్టపు పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పిన ఉత్తమ్.. తమ కుటుంబంలో తాను, తన భార్య  ఉన్నామని.. పిల్లలు కూడా లేరని.. తెలంగాణ ప్రజలే తమ పిల్లలని చెప్పారు. గాంధీభవన్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ పలు అంశాలపై చర్చించారు. 

uttam

tags: uttam, uttam kumar reddy, uttam fire on kcr, uttam fire on kcr hunger strike, uttam about kcr hunger strike, uttam unvailed kcr hunger strike secrets, uttam about kcr hunger strike nims report

Related Post