ప్రజా కూటమిదే ఆధిక్యం

news02 Dec. 5, 2018, 8:18 a.m. political

lagadapati

తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమిదే గెలుపని మాజీ ఎంపీ.. ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజా నాడి కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతోందని ఆయన చెప్పారు. ఐతే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేనన్న లగడపాటి రాజగోపాల్.. మెజార్టీ మాత్రం కాంగ్రెస్ కూటమికే ఉంటుందని తెలిపారు.   ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజా కూటమికి మంచి మెజార్టీ వస్తుందని ఆయన తెలిపారు. వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో టీఆర్ ఎస్ కు స్వల్పంగా ఆధిక్యం ఉండవచ్చని లగడపాి రాజగోపాల్ చెప్పారు. ఇక కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రజా కూటమికి, టీఆర్ ఎస్ పోటాపోటీగా సీట్లు వస్తాయని ఆయన తెలిపారు. 

lagadapati

ఇక హైదరాబాద్‌లో ఎంఐఎంతో పాటు బీజేపీ, ప్రజా కూటమి, టీఆర్ ఎస్ పార్టీలు పంచుకుంటాయని లగడపాటి చెప్పారు. ఈనెల 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు సర్వే పూర్తి వివరాలు వెల్లడిస్తానని లగడపాటి రాజగోపాల్ తెలిపారు. అక్టోబరు 20వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో తమ బృందం నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ మేరకు అంచనాకు వచ్చినట్టు ఆయన చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో వివిధ వర్గాలకు చెందిన 1000 నుంచి 1200 మంది  అభిప్రాయాలు సేకరించి శాస్త్రీయంగా సర్వే చేశామని చెప్పారు లగడపాటి రాజగోపాల్. ఈ సారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

tags: lagadapati, lagadapati survey, lagadapati on ts elections, lagadapati on congress, lagadapati rajagopal survey results on telangana elections, lagadapati survey results on telangana elections

Related Post