ఈవీఎంలపై అనుమానాలున్నాయి

news02 March 15, 2019, 7:23 p.m. political

supreme

ఈ ఎన్నికల్లో 50శాతం వీవీప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాల దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ ఈసీకి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈవీఎంల ద్వారా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఈ లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా 50శాతం మేర వీవీప్యాట్‌లను లెక్కించి, ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వాటిని సరిపోల్చేలని కోరుతూ మొత్తం 23 రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. 

evms

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, ఎస్పీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్‌యాదవ్‌ నేతృత్వంలో 23 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడాను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈసీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో విపక్షాలంతా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. 

tags: evm, evms, vvpat, vvpats, supreme court noyice to EC, supreme notices to Election commission, supreme on evms, supreme on vvpats

Related Post