నాలుగేళ్ళ కేసీఆర్ పాల‌న వైఫ‌ల్యాల‌పై మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ వ్యాసం

news02 June 2, 2018, 10:48 a.m. political

ex mp ponnam prabakar article

నాలుగేళ్ళ‌లో సాధించిందేముంది..? 

టీఆర్ ఎస్ మ్యానిఫెస్టోలో ఒక్క అంశాన్ని కూడా అమ‌లు చేసిన పాపాన పోలేదు

నాలుగేళ్ళ తెలంగాణ‌లో ఒక్క వ‌ర్గం కూడా సంతోషంగా లేదు

నాలుగేళ్ళ‌లో తెలంగాణ ను అప్పుల కుప్ప‌గా మ‌ర్చారు

 

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం .. ఇది 60 యేళ్ళ ఆకాంక్ష‌. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆత్మ బ‌లిదానాలు.. అప్ప‌టి ఏఐసీసీ అధ్య‌క్షురాలు వీట‌న్నింటిని చూసి చ‌లించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. దేశంలోని మిగ‌తా ప‌క్షాల‌న్నింటిని ఏకాతాటిపైకి తెచ్చేందుకు అమ్మ సోనియా గాంధీ ఎన్ని క‌ష్టాలు ప‌డిందో లోక్ స‌భ ఎంపీగా నేను ద‌గ్గ‌రుండి చూశాను. సోనియా ప‌ట్ట‌ద‌ల చూసి ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా తెలంగాణ‌స వ‌చ్చి తీరుతుంది., నా తెలంగాణ ప్ర‌జ‌ల ముఖాలు సుఖ‌సంతోషాలతో నిండిపోతాయ‌ని అప్పుడు అనిపించింది. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత తెలంగాణ ప్ర‌జ‌లు కేసీఆర్ ఇచ్చిన అబ‌ద్ద‌పు హామీలు న‌మ్మి ఓట్లు వేసి గెలిపించారు. ఫ‌లితంగా వేలాది మంది ప్రాణ‌త్యాగాల పునాదుల మీద ఏర్ప‌డిన తెలంగాణ‌లో టీఆర్ ఎస్ స‌ర్కారు వ‌చ్చింది.

 

జూన్ 2 2018 నాటికి కేసీఆర్ ప్ర‌భుత్వం గ‌ద్దెనెక్కి స‌రిగ్గా 4 యేళ్ళు పూర్త‌వుతుంది. అయితే ఈ నాలుగేళ్ళ‌లో తెలంగాణ ప్ర‌జ‌లు ఎప్పుడూ సంతోషంగా లేరు. ఏ ఒక్క వర్గం తృప్తిగా లేదు. దీనికి కార‌ణం ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక‌ నిర్ణ‌యాలు. 2014 ఎన్నిక‌ల ముందు 32 పేజీల‌తో విడుద‌ల చేసిన టీఆర్ ఎస్ మ్యానిఫెస్టోలో ఎన్ని హామీలు అమ‌లు చేశారు. ఏదో ఒక‌టి చెప్పి గ‌ద్దెనెక్కాల‌నే దుర్బుద్దితో సాధ్యం కాని హామీలిచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు కేసీఆర్‌. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు రోజుకో హామీ.. పూట‌కో వేషం వేస్తున్నారు కేసీఆర్. 

బంగారు తెలంగాణ పేరుతో ప్ర‌జ‌ల‌ను భ్ర‌మ‌ల్లో తేల్చుతూ 2 ల‌క్ష‌ల కోట్ల అప్పు చేసి తెలంగాణ ను అప్పుల తెలంగాణ‌గా మార్చారు. ఈ నాలుగేళ్ళ‌లో రాష్ట్రంలో ఒక్కొక్కరి త‌ల‌మీద 51 వేల రూపాయ‌లు అప్పు చేసింది. ఇది మ‌రింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెబుతూ అప్పుల తెలంగాణ‌గా మారుస్తున్నారు. 8 వేల కోట్ల రూపాయ‌లు కేటాయిస్తే చాలు రాష్ట్రంలోని ఆన్ గోయింగ్ సాగునీటి ప్రాజెక్టుల‌న్ని పూర్తై తెలంగాణ లో 10 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరందించే అవ‌కాశం ఉన్నా.. రీడిజైన్ పేరుతో వేల కోట్ల ప్ర‌జా ధ‌నం వృధా చేస్తుంది కేసీఆర్ ప్ర‌భుత్వం. రీడిజైన్ ల‌తో తెలంగాణ ప్ర‌జ‌ల ధనాన్ని ఆంధ్ర కాంట్రాక్ట‌ర్ల జేబులు నింపి క‌మీష‌న్ల‌తో గులాబి నేత‌లు ఆస్తులు పెంచుకున్న‌ది వాస్తావం కాదా..?  

telagana state credits

తెలంగాణ ప్ర‌భుత్వం రాగానే నాలుగునెల‌ల్లోనే రంజాన్ సంద‌ర్బంగా వ‌చ్చే రంజాన్ నాటికి ( 2015  రంజాన్ నాటికి) ముస్లింల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేసి తీరుతామ‌ని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఇదే అంశాన్నిత‌న‌ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు అమ‌లు చేయ‌లేదు. అసెంబ్లీలో నామ‌మాత్రంగా బిల్లును  ఆమోదించి డిల్లీకి పంపి చేతులు దులుపుకున్నారు. ఈ విష‌యం మా ముస్లిం సోద‌రుల‌కు తెలియ‌నిది కాదు.   ఉర్దూకు రెండో అధికార భాష‌గా హోదా క‌ల్పిస్తామ‌న్న కేసీఆర్ అది కూడా అమ‌లు చేయ‌లేదు. హైద‌రాబాద్ లో నిర్మిస్తామ‌న్న బంజారా భ‌వ‌న్‌, క్రిష్టియ‌న్ భ‌వ‌న్ ల ఊసే లేదు. సెక్యుల‌ర్ పార్టీగా ముసుగువేసుకున్న కేసీఆర్ మ‌త‌త‌త్వ బీజేపీతో చేతులు క‌లిపి  మైనార్టీల‌ను మోసం చేస్తున్నారు. ఇల్లులేని నిరుపేద‌ల‌కు 125 గ‌జాల్లో డ‌బ‌ల్ బెడ్ రూం ఇండ్లు క‌ట్టిస్తామ‌ని చెప్పిన కేసీఆర్‌.. ఈ నాలుగేళ్ళ‌లో ఎన్ని ఇండ్లు క‌ట్టించారె చెప్ప‌గ‌ల‌రా..?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్బావానికి కార‌ణ‌మైన అమ‌ర‌వీరులను కూడా మోసం చేశారు. అమ‌రుల కుటుంబాల‌కు 10 ల‌క్ష‌ల రూపాయ‌లు, ఇంట్లో ఒక‌రికి ప్ర‌భుత్వ‌ ఉద్యోగం, డ‌బుల్ బెడ్ ఇళ్ళు, హైద‌రాబాద్ లో అత్యంత ఎత్తైన అమ‌రుల స్మార‌క చిహ్నం, అమ‌రుల స్మృతి వ‌నం నిర్మించి  త్యాగ‌జ్యోతిని ఏర్పాటు చేసిన హామీ గుర్త‌లేదా..?  ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని చెప్పి నిరుద్యోగుల‌ను ప‌ట్టించుకోకుండా మీఇంట్లో మాత్రం నీకు, నీ కొడుకుకు, కూతురుకు, అల్లుడికి , మ‌రో బందువుకు ప‌ద‌వులు పొందింది నిజం కాదా.? 

ద‌ళితుల‌కు మూడెక‌రాలు ఇస్తాన‌ని ప్ర‌గ‌ల్బాలు ప‌లికిన కేసీఆర్‌.. ఈ నాలుగేళ్ళ‌లో ఎంత మంది ద‌ళితుల‌కు మూడెక‌రాలు పంచారో చెప్ప‌గ‌ల‌రా..?   కేజీ టూ పీజీ విధ్య అమ‌లు చేస్తామ‌ని చెప్పి ఓట్లు వేయించుకున్నకేసీఆర్.. ఈ నాలుగేళ్ళ‌లో ఎక్క‌డ అమ‌లు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గానికి ఒక పాలిటెక్నిక్ క‌ళాశాల ఏర్పాటు చేస్తామ‌న్న హామీ ఏమైంది.  ప్ర‌తి జిల్లా కేంద్రాల్లో సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిటల్‌, మండ‌ల కేంద్రాల్లో 30 ప‌డ‌క‌ల హాస్పిట‌ల్‌, హైద‌రాబాద్ చుట్టు పెద్ద పెద్ద హాస్పిట‌ల్స్ నిర్మిస్తామ‌న్న హామీ ఏమైంది. 

పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న రైతాంగానికి మీరిచ్చిన ధైర్యం ఏంటి.. చేతుల‌కు బేడీలు వేసి వారి ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ తీసింది మీరు కాదా..? 4 గేళ్ళ పాటు రైతుల వైపు చూడ‌ని కేసీఆర్‌.. ఇప్పుడు మ‌ళ్ళీ ఎక‌రాల‌కు 4  వేల ప‌థ‌కం, భీమా ప‌థ‌కం ఓట్ల కోసం కాదా..? ఈ ప‌థ‌కాన్నికౌలు రైతుకు వ‌ర్తింప‌చేయ‌క పోవ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత గిరిజ‌నుల ప‌ట్ల ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఏమాత్రం బాగా లేదు. క‌నీసం గిరిజ‌న యూనివ‌ర్శిటీ ఏర్పాటు చేస్తామ‌న్న హామీ ఏమైంది... 

telangana formers sucides

రాష్ట్రానికి కుప్ప‌లు తెప్ప‌లుగా కొత్త ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయ‌ని చెప్పిన స‌ర్కారు పెద్ద‌ల మాటల్లో వాస్త‌వం ఎంత‌..? ఈ నాలుగేళ్ళ‌లో ఎన్ని కొత్త ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి.. వాటిలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్ప‌గ‌ల‌రా...?  హైదార‌బాద్ లో ట్యాంక్ బండ్ నీటి శుద్ది, మూసీ న‌ది పున‌రుజ్జీవం, మురికి వాడ‌ల్లో మౌళిక స‌దుపాయాల రూప‌క‌ల్ప‌న‌, ట్రాఫిక్‌, కాలుష్య నియంత్ర‌ణ‌, హైద‌రాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్ లాంటి హామీల‌న్ని మూట‌గ‌ట్టి మూల‌కు పెట్టింది నిజం కాదా.? 

వీట‌న్నింటికి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స‌మాధానం చెప్పాల్సిందే.. ఇప్పుడు చెప్ప‌కున్నా వ‌చ్చే ఎన్నిక‌ల ముందు ప్ర‌జా క్షేత్రంలో కేసీఆర్ నోరు విప్ప‌క త‌ప్ప‌దు. లేకుంటే ప్ర‌జ‌లే బుద్ది చెబుతారు. తెలంగాణ చరిత్ర‌లో ఈ ఐదేళ్ళు చీక‌టి అధ్యాయంగా మిగిళింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీయే శ్రీరామ ర‌క్ష‌. తెలంగాణ ఇచ్చిన త‌ల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు.. క‌ప‌ట మాటల‌తో అధికారం చేప‌ట్టిన కేసీఆర్ కు బుద్ది చెప్పేందుకు తెలంగాణ ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు..

ponnam prabakar

          పొన్నం ప్ర‌భాక‌ర్‌

          మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు

          తెలంగాణ  కాంగ్రెస్

tags: ponnam prabakr, special article, kcr 4yreaes govt, telangana scheme, telangana congress, telangana formation day, telangana govt, pragathibavan.

Related Post