గాంధీభ‌వ‌న్ లో కాంగ్రెస్ ఆవిర్బావ వేడుక‌లు ..!

news02 Dec. 28, 2018, 3:53 p.m. political

congress

హైద‌రాబాద్ : కాంగ్రెస్ 134వ ఆవిర్బావ వేడుక‌లు గాంధీభ‌వ‌న్ లో ఘ‌నంగా జ‌రిగాయి. గాంధీభ‌వ‌న్ ఆవ‌ర‌ణ‌లో పార్టీ జెండా ఎగువ‌వేసిన పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స్వ‌తంత్ర భార‌త దేశంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంతో ఉన్న‌త‌మైంద‌న్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మిపై పార్టీ క్యాడ‌ర్ ఎక్క‌డా నైరాశ్యానికి లోనుకావ‌ద్ద‌ని సూచించారు. గెలుపు ఓట‌ములు పార్టీకి స‌హ‌జ‌మ‌న్న ఉత్త‌మ్ .. ఓట‌మిని ప‌క్క‌న‌బెట్టి .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుకు కృషిచేయాల‌ని పిలుపు నిచ్చారు.

congress

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేసిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి .. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక అధిష్టానం ప‌రిధిలో ఉంద‌న్నారు. రాష్ట్రంలో పార్టీ ఓట‌మిపై ఇప్ప‌టికే అధిష్ఠానానికి ప్రాథమిక నివేదిక ఇచ్చామని చెప్పారు ఉత్త‌మ్ . ఇప్పటి వరకు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారమే కాలేదని .. ఇంకా సీఎల్పీ ఎన్నికకు తొంద‌రేముంద‌ని ఉత్తమ్ ప్ర‌శ్నించారు. ఇక  కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ గురించి తానేమీ మాట్లాడనని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. 

congress

tags: Congress Foundation Day Celebratins,uttamkumarreddy,janareddy,revanthreddy,shabberali,bhatti vikramarka,rahulgandhi,soniya gandhi,aicc,gandhibhavan,tpcc

Related Post