అమిత్ షా బాష అభ్యంతరకరం

news02 April 13, 2019, 8:40 p.m. political

amith shah

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా దేశ పునాదులనే పెకిలించాలని చూస్తున్నారని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. మొన్న జాతీయ పౌరసత్వ నమోదుపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకుగానూ అందరికి ఆయన క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టికను ప్రవేశపెడతామని ఎన్నికల ప్రచారంలో అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతే కాదు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ దేశం అన్ని వర్గాలు, కులాలు, మతాల వారికి చెందినదందన్న మెహబూబా.. అనుచిత వ్యాఖ్యలతో దేశంలో అనిశ్చితి నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అమిత్‌ షా వ్యాఖ్యలు దేశ లౌకికత్వంపై దాడి చేయడమేనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓట్ల కోసం అమిత్‌ షా ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరమన్న మెహబూబా.. ఈ దేశపు లౌకికత్వ సిద్ధాంతాల వల్లే జమ్మూకశ్మీర్‌ భారత్‌లో విలీనం అయిందని వ్యాఖ్యానించారు. ఈ దేశ పునాదులే లౌకికత్వంపై ఆధారపడి ఉన్నాయని చెప్పిన ఆమె.. అమిత్ షా ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని అన్నారు. 

tags: amith shah, ex cm mehabuba fire on amith shah, mehabuba mufti fire on amith shah, kashmir ex cm mehabuba mufti fire on amith shah

Related Post