కార్ణాటక నేతలకు వార్నింగ్

news02 Dec. 25, 2018, 8:52 a.m. political

rahul

కర్ణాటక కాంగ్రెస్ నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. పార్టీలోని తిరుగుబాటు నేతలపై చర్యలు తీసుకుంటామని ఘాటుగా స్పందించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, తిరుగుబాటు ధోరణి ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని కర్ణాటక కాంగ్రెస్‌ నేతలను రాహూల్ హెచ్చరించారు. ఇటువంటి చర్యలను సహించబోమని ఆయన తేల్చి చెప్పారు. రెండు రోజుల క్రితం కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన నేపథ్యంలో పదవులు దక్కని కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు చెలరేగుతున్న నేపథ్యంలో.. తమ పార్టీలో వారిని చేర్చుకునేందుకు తలుపులు తెరిచే ఉంటాయని బీజేపీ ప్రకటించింది. దీంతో రాహుల్‌ తమ పార్టీ నేతలకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. 

rahul

ఇక కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఇటీవల ఇద్దరు మంత్రులను తొలగించారు. వారిలో ఒకరు కాంగ్రెస్‌ నేత రమేశ్‌ జార్కిహొళి కాగా మరొకరు స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్‌. జార్కిహొళి ప్రతిపక్ష నేతలతో సన్నిహితంగా ఉంటూ, మరోవైపు కేబినెట్‌ సమావేశాలకు హాజరుకావడం లేదంటూ ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించారు. మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆర్‌ రామలింగారెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జూనియర్లకే మంత్రి పదవులు ఇస్తున్నారా.. మరి ఇంతకు ముందు కూడా మంత్రులుగా పని చేసిన వారూ ఇప్పటికీ మంత్రి పదవుల్లో ఉన్నారు కదా.. అని విమర్శలు గుప్పిస్తున్నారు. దీన్ని బీజేపీ అవకాశంగా తీసుకుని కాంగ్రెస్ అసంతృప్తి నేతలన తమపైవు లాక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో రాహూల్ గాంధీ తమ పార్టీ నేతలకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు.
 

tags: rahul, rahul gandhi, rahul warning to congress leaders, rahul warned congress laders, rahul warned karnataka congress leaders, rahul gandhi warned karnaraka congress leaders

Related Post