12వతేదీ లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం

news02 April 10, 2019, 7:15 p.m. political

cm kcr

టీఆర్ ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం సందర్బంగా హిందువులను కించపరిచేవిధంగా కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారంటూ విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసులు ఇచ్చింది. మార్చి 17న కరీంనగర్‌ బహిరంగ సభలో హిందువులనుద్దేశించి కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని వీహెచ్ పీ ఆరోపిస్తోంది. ఈమేరకు కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ రామరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేసీఆర్‌ ఉల్లంఘించారని రామరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన పిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఈసీ.. సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు జారీ చేసిన ఆదేశాల్లో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

tags: ec, election commission of india, ec notice to cm ckr, election commission notice to cm kcr, ec of india notice to cm kcr, eci notice to cm kcr, ec notice to telangana cm

Related Post