ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌ అండ‌గా ఉంటుంది.

news02 June 9, 2018, 9:52 p.m. political

Pcc chief utham kumar reddy

న‌ల్గొండ ః తెలంగాణ‌లో పూర్తిగా కుటుంబ పాలన... నియంత పాలన సాగుతుందన్నారు పీసీసీచీఫ్ ఉత్తం. తెలంగాణలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. అన్ని వర్గాల ప్రజలు నైరాశ్యంలోకి నెట్టబడ్డారని అన్నారు. నాలుగు వేల పెట్టుబడి సాయం నాలుగేళ్ల తర్వాత ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్ర‌శ్నించారు.  అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఎందుకు ఇవ్వలేదో కేసీఆర్ స‌మాదానం చెప్పాల‌న్నారు. కేవలం వచ్చే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని చేసింది కాదా? అని ప్ర‌శ్నించారు. రుణమాఫీ వడ్డీ భారాన్ని భరిస్తామని నిండు అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్‌ మాట తప్పారని విమ‌ర్శించారు. ఆర్టీసీ కార్మికులను బెదిరించడాన్ని ఉత్త‌మ్ త‌ప్పు బ‌ట్టారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధించుకునేందుకు కాంగ్రెస్ అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. బడ్జెట్లోలోనే ఆర్టీసీకి తగిన కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆది నుంచి అందరిని బెదిరించే ధోరణిని అనుసరిస్తున్నారని విమ‌ర్శించారు.

Palvai goverdhan reddy

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయంమ‌న్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారంలోకి రాగానే రైతుల‌కు రెండు లక్షల రుణమాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. దీనికి తోడు పంటలకు కేంద్రం ఇచ్చే మద్దతు ధరలకు అదనంగా బోనస్ ఇస్తామ‌న్నారు. వరికి రెండు వేల, పత్తికి ఆరువేల, మిర్చికి 10000లకు తక్కువ కాకుండా మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో అద్భుతమైన పంటల బీమా పథకం తెస్తామ‌ని హామీ ఇచ్చారు. ఒక్క ఎకరా ఎండినా ఆదుకుంటామ‌ని తెలిపారు. తెలంగాణ రైతు చచ్చిన తర్వాత కాదు... బతికున్నప్పుడే ఎందుకు ఆదుకోవడం లేదె సీఎం కేసీఆర్ రైతుల‌కు స‌మాదానం చెప్పాల‌న్నారు.

 

Mp palvai goverdhan reddy vardhanthi
న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో దివంగ‌త నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మొద‌టి వ‌ర్థంతి స‌భ‌లో ఉత్త‌మ్ తో పాల్గొన్నారు.  రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన నేత. తెలంగాణ రాజకీయాల్లో పాల్వాయిది ప్రత్యేక పాత్రని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించార‌ని అన్నారు. నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన నేత పాల్వాయి అన్నారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న ఉత్త‌మ్‌... 2019లో మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి నిజమైన నివాళులు అర్పించాలని కార్య‌క‌ర్త‌ల‌కు పిలిపిచ్చారు.

tags: tstc, rtc bus bhavan, palvai goverdhan reddy vardhanthi, telangana bhavan, cm kcr, palvai goverdhan reddy, pcc chief, munugodu ,mla, palvai goverdhan reddy dead body, utham kumar reddy family, utham kumar reddy adderess, cm kcr whatsup, rtc bus timings, tsrtc bus routes, tsrtc bus fares, bus pass counters, telangana transport corporation, cm kcr speech, cm kcr adderess, telangana cm, telangana fisrt cm.

Related Post