353,294(బి) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు

news02 June 2, 2018, 10:56 a.m. political

fir on challa dharma reddy
వ‌రంగ‌ల్: టీడీపీ జంపింగ్ జ‌పాంగ్‌... బంగారు తెలంగాణ బ్యాచ్ ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డిపై కేసు న‌మోదైంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్‌ జి.సదానందంను దూషించిన ఘటనలో ఆయ‌న‌పై సుబేదారి పోలీసులు కేసు బుక్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు విధుల‌కు ఆటంకం క‌ల్గించినందుకు జడ్పీటీసీ కల్పన, కానిస్టేబుల్‌పై కూడా పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఐపీసీ 353(విధులను అడ్డుకోవడం), 294(బి) (దుర్భాష‌లాడినందుకు) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 

challar dharma reddy with kcr

అయితే గురువారం ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ‘టెక్స్‌టైల్‌ పార్కు భూనిర్వాసిత రైతులకు నష్టపరిహారం విష‌యంలో... సూపరింటెండెంట్‌ సదానందంతో గొడ‌వకు దిగిన దుర్భాష‌లాడిన‌ విష‌యం తెలిసిందే. ఆయ‌న‌తో పాటు జ‌డ్పీటీసీ క‌ల్ప‌న‌, మ‌రో కానిస్టేబుల్ కూడా స‌దానందంతో వాగ్వివాదానికి దిగిన విష‌యం విధిత‌మే. అయితే ఇదే విష‌యాన్ని సీరియ‌స్ తీసుకున్న రెవెన్యూ సిబ్బంది క‌లెక్ట‌ర్ హ‌రిత‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె సుబేదారి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో... పోలీసులు ఎమ్మెల్యే చ‌ల్లా, జ‌డ్పీటీసీ క‌ల్ప‌న‌, కానిస్టేబుల్‌పై కేసు న‌మోదు చేశారు. 
 

tags: police fir on challa dharma reddy, subhedar police,warangal rural collector,harita,

Related Post