క్యాబినెట్ ఆలస్యం వెనక కారణం ఇదేనా..?

news02 Jan. 3, 2019, 8:24 a.m. political

Cm kcr shock

హైదరాబాద్: ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఆ వెంటనే సీఎంగా ప్రమాణ స్వీకారం ఆ తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీ కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్ తన ఏకపక్ష వ్యవహారాన్ని మరోసారి ప్రదర్శిస్తున్నారు. టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి 20 రోజులు దాటిపోయింది. కానీ ఇప్పటివరకు తాను సీఎంగా, మహమూద్ అలి హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం తప్ప ఎవరికీ ఏ పదవులు ఇవ్వలేదు. క్యాబినెట్ విస్తరిస్తే తమకు అవకాశం ఉంటుందని భావిస్తున్న ఎమ్మెల్యేల ఆశలకు అంతలోనే కెసిఆర్ గండికొట్టారు. 

 

మొన్నటివరకుముహూర్తాలు లేనందుకే మంత్రివర్గం ఆలస్యమవుతుందని ఆశావాహులు అంతా భావించారు. కానీ కెసిఆర్ కావాలని మంత్రివర్గ విస్తరణ ఆలస్యం చేస్తున్నారని ఎమ్మెల్యేలకు ఆలస్యంగానే అర్థమైంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని రాగానే డిసెంబర్ చివరి కల్లా మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ చర్చ జరిగింది కానీ "అంత తొందరెందుకు మంచిరోజులు రానీ" అని కెసిఆర్ నోట వెంట మాట రావడం తో ఆశలు ఆవిరయ్యాయి. ఎమ్మెల్యేలు సంక్రాంతి పండుగ వరకు చూడాల్సిందేనని భావించారు కానీ అది కూడా సాధ్యం అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.

Cm kcr oath second time

సర్పంచి ఎన్నికలకు ఎన్నికల కోడ్ రావడంతో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా ఎన్నికల కమిషన్ నిబంధన విధించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా చేయొద్దు అంటూ మెలిక పెట్టింది. ఇప్పట్లో మంత్రి పదవులు దక్కే అవకాశాలు లేవంటూ నిరాశకు గురవుతున్నారు. జనవరి చివరి వరకు మూడు విడతలుగా సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే జనవరి వరకు మంత్రివర్గ విస్తరణ లేనట్లే ఆ తర్వాత వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా రాబోతుంది. మార్చ్ నెల నుంచి లోక్ సభ ఎన్నికల కోడ్ కూడా అమలులోకి రాబోతుంది. ఇప్పటినుంచి ఏప్రిల్ రెండో నెల వరకు ఏదో ఒక ఎన్నిక రావడం .. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం జరుగుతుంది. దీంతో మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అన్న చర్చ టిఆర్ఎస్ లో జరుగుతుంది.

Telangana bavan latest

కేసీఆర్.. మంత్రివర్గ విస్తరణ చేయాలనుకుంటే ఇప్పటికే చేసేవారు కానీ కావాలని కేసీఆర్ ఆలస్యం చేస్తున్నారని టీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది. దీని వెనుక కేసీఆర్ వ్యూహం ఏంటో అర్థం కావడం లేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలు గుసగుస లాడుతున్న రు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను గాలం వేసేందుకు మంత్రి పదవులను ఆశగా చూపించేందుకే క్యాబినెట్ విస్తరణ ఆలస్యం చేస్తున్నారన్న చర్చ సర్వత్రా జరుగుతుంది. మంత్రి పదవుల కోసం ఇప్పటి వరకు ఎదురుచూసి న ఎమ్మెల్యేలు.. కేసిఆర్ ఇచ్చిన షాక్ తో జరుగుతున్న పరిణామాలు మౌనంగా చూస్తున్నారు.

tags: Cm kcr oath, cm kcr new pic, cm kcr phone number, cm kcr family, cm kcr pics, pragathibvan, Telangana bavan, Ktr new pics, Telangana governer, governer narsimhan, Telangana Raj Bhavan.

Related Post