టిఆర్ఎస్ ఫీల్ గుడ్ కు బ్యాడ్ డేస్ స్టార్ట్

news02 Aug. 14, 2018, 9:34 p.m. political

Rahul Gandhi Telangana tour

హైదరాబాద్ : రాహుల్ టూర్ తో అనుకున్నంత పని అయింది. టిఆర్ఎస్ నేతలు ముందు వూహించారో అదే జరిగింది. రెండురోజుల రాహుల్ టూర్ టిఆర్ఎస్ నేతలకు వణుకు పుట్టించింది. ఎటుచూసినా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభంజనమే కనిపించింది. దీంతో టీఆర్ఎస్ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. 

AICC president Rahul Gandhi women conference in Telangana

అటుశంషాబాద్ లో మహిళా సంఘాలతో సమావేశం తో మొదలుపెడితే సరూర నగర్లో నిర్వహించిన నిరుద్యోగ సదస్సు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఊహించనంత రెస్పాన్స్ ప్రజల నుంచి వచ్చింది. రాహుల్ ప్రసంగానికి జనం జేజేలు పలికారు. అంత ఫీల్ గుడ్ వాతావరణమే ఉంది టిఆర్ఎస్ కు తిరుగులేదని భావిస్తున్న నేతలకు రాహుల్ టూర్ తో వాస్తవికత తెలిసివచ్చింది. జనమంతా కాంగ్రెస్ కు మద్దతుగా నిలవడం టిఆర్ఎస్ నేతల ఆందోళనకు గురిచేసింది.

Rahul Gandhi with women self help groups

మొదటినుంచిరాహుల్ టూర్ పై నిఘా వేసిన అధికార పార్టీ షాక్ తిన్నది. సభలకు జనం భారీగా తరలి రావడం, సామాన్య జనాల్లో కాంగ్రెస్ పై పాజిటివ్ చర్చ జరగడం టిఆర్ఎస్ నేతలకు షాక్ ఇచ్చింది. సమావేశాలకు ఎంతమంది వస్తున్నారు.. ఎక్కడ నుంచి వస్తున్నారు.. ఏమంటున్నారు ఇలాంటి అన్ని అంశాలపైనా ద్వారా గులాబీ బాస్ కేసిఆర్ ఇంటలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించారు. ముందు రాహుల్ టూర్ ను ఎవరు పట్టించుకుంటారులే అనుకున్న టీఆర్ఎస్ నేతలకు గట్టి షాక్ తగిలింది. ఇదే హవా గనక ఎన్నికల వరకు కొనసాగితే కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదన్న చర్చ టిఆర్ఎస్ లో వినిపించింది.

Rahul Gandhi Telangana tour 2018

ఎక్కడసర్వేలు చేసిన వంద సీట్లు టిఆర్ఎస్ కు పక్కా వస్తాయి అని చెప్తున్న నేతలకు ప్రజల్లో కాంగ్రెస్ పైన ఉన్న ఆదరణ చూసి అవాక్కయ్యారు. కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుందని రాహుల్ టూర్ తో తేలిపోయింది. రాహుల్ గాంధీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు అధికార పార్టీ నుంచి సమాధానం కూడా లేక గులాబీ నేతలు డీలా పడ్డారు. రాహుల్ గాంధీ ఎక్కడ అడుగుపెట్టినా వేలాదిగా జనం తరలి రావడం చూస్తుంటే ప్రజలు టిఆర్ఎస్ పై ఎంత కసిగా వున్నారో తెలుస్తుందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు.

CM KCR fear about Rahul Gandhi Telangana tour

రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ తో కాంగ్రెస్ లో ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు జోష్ నిండటమే కాదు సాధరణ జనాలకి కూడా కాంగ్రెస్ పై సదాభిప్రాయం ఏర్పడిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంచనావేస్తున్నారు. రాహుల్ గాంధీ స్పీచ్ హైలెట్ గా నిలిచింది పార్టీ క్యాడర్ కే కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారు. అనే అంశాలపై రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు.ఎన్నికల వరకు ఇదే జోష్ కొనసాగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలు ఉన్నా రాహుల్ గాంధీ టూర్ సక్సెస్ చేయడంలో విజయం సాధించారని పార్టీ కిందిస్థాయి శ్రేణులు సంబరపడుతున్నాయి.

tags: Rahul Gandhi Telangana tour, ICC president Rahul Gandhi, Rahul Hyderabad tour, Rahul Gandhi in Gandhi Bhavan, Rahul Gandhi on KCR tournament, Rahul Gandhi fire on CM KCR, Rahul Gandhi with unemployment youth, Rahul Gandhi meeting at saroornagar ground, Rahul Gandhi in Haritha Plaza Hotel, Rahul Gandhi, Rahul Gandhi tributes to Telangana amaraveerula Sthupam, CM KCR on Rahul Gandhi, Rahul and Rafel scam, Rahul Gandhi latest meet at Hyderabad, Rahul Gandhi Telangana tour, telangana election 2019, Telangana Congress leaders meet Rahul Gandhi.

Related Post