హుజూర్ నగర్ ను అభివృద్ది చేస్తా

news02 Jan. 24, 2019, 7:02 p.m. political

uttam

హుజూర్ నగర్ నియోజక వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. జరగనున్న గ్రాంపంచాయితి ఎన్నికల్లో కాంగ్రేస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పధకాలను అర్హులు అయిన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని పీసిసి చీఫ్ హామి ఇచ్చారు. చిల్లర మాటలను, చిల్లర గాళ్లను పట్టించుకోవద్దని చెప్పారు. ఒక్కొక్కరు సర్పంచ్ అభ్యర్థులకు వంద చొప్పున ఓట్లు వేయించి అఖండ మెజార్టీ తో గెలిపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. 

uttam

tags: pcc, pcc chief uttam, uttam kumar reddy, uttam kumar reddy, uttam pcc chief, uttam sarpanch election campaign, uttam kumar reddy huzurnagar visit

Related Post