సీబీఐ ముందు రాహూల్ నిరసన

news02 Oct. 26, 2018, 8:50 p.m. political

rahul

తనను కేంద్ర ప్రభుత్వం ఎన్ని సార్లయినా అరెస్టు చేయగలదు.. కానీ నిజాన్ని మాత్రం దాచలేరని ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ అన్నారు. సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మను సెలవుపై పంపడాన్ని వ్యతిరేకిస్తూ రాహూల్ ఆద్వర్యంలో కాంగ్రెస్ నేతలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళనలో రాహుల్‌గాంధీతో సహా వేలాది మంది కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు పాల్గొన్నారు. నిరసనల నేపథ్యంలో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని.. లోధి రోడ్డు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

rahul

ఈ సందర్బంగా రాహూల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ ఈ దేశాన్ని మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నరేంద్ర మోదీ నిజానికి దూరంగా పారిపోవచ్చు... కానీ నిజాన్ని మాత్రం దాయలేరని రాహూల్ వ్యాఖ్యానించారు. సీబీఐ డైరెక్టర్‌ను మార్చినంత మాత్రాన పని జరగదన్న రాహూల్.. ప్రధాని ఏం చేశారో దేశ ప్రజలు తెలుసుకుంటారని చెప్పారు. తనను కేంద్ర ప్రభుత్వం ఎన్ని సార్లు అయినా అరెస్టు చేయవచ్చు... కానీ నిజాన్ని మాత్రం దాయలేరని రాహూల్ అన్నారు. త్వరలోనే వాస్తవాలన్నీ తప్పకుండా బయటకొస్తాయని ఆయన చెప్పారు.

 

tags: rahul, rahul gandhi, rahul fire on modi, rahul fire on pm modi, rahul protest in front of cbi, rahul gandhi protest at cbi office, congress proest in front of cbi

Related Post