పోటీ చేస్తారా.. లేక ఓటు మాత్రమేనా

news02 March 3, 2019, 4:47 p.m. political

aliవచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రముఖ సినీ నటుడు అలీ తెగ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ఆయన చంద్రబాబు సహా, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ ను కలిశారు. ఇందులో భాగంగానే ఆలీ గుంటూరు నగరంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలీ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని యేచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులో తనకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. ఆలీ ధరఖాస్తును పరిశీలించిన ఎన్నికల అధికారులు ఇప్పటికే హైదరాబాద్‌లో ఓటరుగా నమోదై ఉన్నారని తెలుసుకుని ఆ విషయాన్ని అలీకి తెలియజేశారు. ఐతే తనకు తెలంగాణలో ఓటు హక్కు తొలగించి.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల అధికారులను కోరారట ఆలీ. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆలీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారంది.

 

tags: ali, actor ali, comedian ali, ali entering in politics, actor ali entering in politics, ali contesting in election, actor ali contesting in election

Related Post