మీ భవిష్యత్తు కోసం ప్రజా కూటమిని గెలిపించండి

news02 Dec. 5, 2018, 7:45 a.m. political

sonia

ఈనెల 7న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని ప్రజా కూటమికే ఓటు వెయ్యాలని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పిలుపునిచ్చారు.  ఈ మేరకు ఆమె ప్రత్యంకగా తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరేందుకు ప్రజాకూటమికి ఓటు వేయాలని సోనియాగాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ నుంచి సోనియాగాంధీ 76 సెకన్ల వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ సందేశంలో సోనియా గాంధీ ఏం చెప్పారంటే.. తెలంగాణ సోదర సోదరీమణులారా, డిసెంబరు 7న మీరు ఓటు వేసే రోజు. మీ ఓటుని మీరు తెలంగాణ భవిష్యత్తు కోసమే కాదు. మీ భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో వేయాలి. 

sonia

ప్రజాకూటమిలోని కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మీ గొంతుకలు. ఇది మీ కూటమి. నాలుగున్నరేళ్ల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. ఇందులో నా పాత్ర కూడా ఉంది. కానీ మీరు తెలంగాణలో అధికారంలో ఉన్న వారి చేతుల్లో మోసపోయారు. ఇప్పుడు సమయం వచ్చింది. తెలంగాణలో మీరు ఎక్కడున్నా మీ ఆశలు, ఆకాంక్షలు, కలలు పూర్తికావాలంటే మీరంతా ప్రజాకూటమికి ఓటు వేయాలని వ్యక్తిగతంగా కోరుతున్నాను. జైహింద్‌.. జై తెలంగాణ అంటూ సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ.. కాంగ్రెస్ సారధ్యంలోని ప్రజా కూటమి అభ్యర్ధులకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

 

tags: sonia, sonia gandhi, sonia messege to telangana people, sonia gandhi messege to telangana people, sonia gandhi messege to telangana voters, sonia gandhi request to telangana people

Related Post