ఏబీపీ-సీఓటర్ సర్వేలో వెల్లడి..

news02 Oct. 9, 2018, 9:28 a.m. political

abp c voter

మళ్లీ అధికారంలోకి రావాని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి గట్టి షాక్ తగిలింది. త్వరలో మూడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని సర్వేలన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ- మోదీ పని అయిపోటినట్టేనని సర్వే ఫలితాల్లో తేలింది. ఏబీపీ- సీవోటర్ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని తేలిందట. కాస్త అటూ ఇటుగా ఈ మూడు రాష్ట్రాల్లోను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చని ఈ సర్వే నివేధిక చెబుతోంది. ఇంకేముంది తమకిక తిరుగులేదని భావిస్తున్న బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. ముందు నుంచి ఈ రాష్ట్రాల్లో గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్ నేతలకు.. సర్వే ఫలితాలు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. 

abp cvoter

ఏబీపీ- సీవోటర్ సర్వే ఫలితాలు..

రాజస్థాన్‌ లోని మొత్తం 200 అసెంబ్లీ సీట్లలో.. కాంగ్రెస్‌ పార్టీకి 142, బీజేపీకి 56 సీట్లు.

మధ్యప్రదేశ్‌ లోని మొత్తం 230 అసెంబ్లీ నియోజక వర్గాల్లో.. కాంగ్రెస్‌కి 122 సీట్లు, బీజేపీకి 108 సీట్లు

ఛత్తీస్‌గఢ్‌ లోని మొత్తం 90 అసెంబ్లీ నియోజక వర్గాల్లో.. కాంగ్రెస్‌కి 47, బీజేపీకి 40 సీట్లు.

ఇక తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లోను కాంగ్రెస్ పార్టీ గెలుపుకే ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రాధమికంగా నిర్వహించిన సర్వే ఫలితాలు చెబుతున్నాయట. ఈ రెండు రాష్ట్రాలకు సంబందించిన సర్వే నివేధిక త్వరలోనే వెలువడనుందని సమాచారం. 

tags: abp cvoter, abp cvoter survey, abp c voter survey on elections, abp cvoter survey on rajastan, abp cvoter survey on madhyapradesh, abp cvoter on chattisgadh, abp cvoter survey on three states, abp c voter survey on telangana

Related Post