క‌ర్ణాట‌క ఆప‌రేష‌న్ ను కేసీఆర్ ఫెయిల్ చేశార‌ని కోప‌పా..?

news02 May 29, 2018, 8:33 p.m. political

Pm modi rejected cm kcr appointment

ఢిల్లీ ః నాలుగు రోజులు ఢిల్లీలోనే మ‌కాం వేయాల‌ని అనుకున్నారు..? ప‌్యామిలీతో స‌హా హ‌స్తిన‌కు వెళ్ళారు. కాని రెండో రోజే తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చారు.. తన‌ను క‌లిసేందుకు సీఎం కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీని అపాయింట్‌మెంట్ అడిగినా పీఎంఓ ఆఫీస్ నో చెప్పేసింది. అదే క‌ర్ణాట‌క కొత్త సీఎం కుమార‌స్వామికి స‌మ‌యం ఇచ్చారు. అస‌లు కేసీఆర్ కు మోడీ ఎందుకు స‌మ‌యం ఇవ్వ‌లేదు.. రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ ఇది.

Karnataka cm kumaraswamy met pm modi

పీఎం మోడీకి.. సీఎం కేసీఆర్ కు మొద‌టినుంచి మంచి సంబందాలున్నాయి. మోడీ ప్ర‌ధాని అయ్యాక తీసుకున్న అన్ని నిర్ణ‌యాల‌కు మ‌ద్ద‌తిచ్చారు. అయినా మోడీ .. సీఎం కేసీఆర్ కు సమ‌యం ఇవ్వ‌క‌పోవ‌టంపై అనేక చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మోడీ.. కేసీఆర్ కు ఇచ్చిన ఆప‌రేష‌న్ ఫెయిల్ కావ‌ట‌మే ఇందుకు కార‌ణం అయ్యిండొచ్చ‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ తో కాంగ్రెస్ తో దోస్తీ చేస్తున్న పార్టీల‌న్నింటిని ఆ పార్టీ కి దూరం చేయాల‌ని కేసీఆర్ చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. ఫ్రంట్ ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ ను క‌లుపుకునే పోవాల‌ని మ‌మ‌త‌, డీఎంకే నేత‌లు స్టాలిన్, క‌ళిమొని మిగతా నేత‌లు చెప్ప‌టం ప్ర‌ధాని మోడీకి మింగుడు ప‌డ‌టం లేద‌ట‌. కేసీఆర్ ఈ ఆప‌రేష‌న్ ను ఫెయిల్ చేయ‌టంతోనే మోడీ .. కేసీఆర్ ను క‌లిసేందుకు ఇష్ట‌ప‌డలేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

Cm kcr met pm modi

క‌ర్ణాట‌క‌లోనూ కేసీఆర్ చేసిన ఆప‌రేష‌న్ విక‌టించింది. కాంగ్రెస్ ను ఓడించాల‌నే ఉద్దేశంతో బెంగుళూరు వెళ్ళి జేడీఎస్ కు మ‌ద్ద‌తిస్తే... ఎన్నిక‌లు ముగిషాక ఆ పార్టీ బీజేపీకి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ తో క‌లిసింది. ఫైన‌ల్ గా ద‌క్షిణాదినుంచి కాంగ్రెస్ పంపించాల‌న్న‌ బీజేపీ పాచిక పార‌లేదు. దీంతో కేసీఆర్ పై మోడీ న‌మ్మ‌కం పోయింద‌న్న చ‌ర్చ ఉంది. కేసీఆర్ తో త‌న‌కు ఉప‌యోగం లేద‌నే కేసీఆర్ కు స‌మ‌యం ఇవ్వ‌లేద‌నే కొంద‌రు నేత‌లు భావిస్తున్నారు. దీంతోనే తెలంగాణ లో త‌ప్ప కేసీఆర్ రాజ‌కీయాలు ఎక్క‌డ చెల్ల‌వ‌ని రాష్ట్ర బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు భావిస్తున్నాయి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.ల‌క్ష్మ‌ణ్ ప‌దేప‌దే ఈవిమ‌ర్శ చేయ‌టం అనుమానాల‌కు తావిస్తోంది.

tags: cm kcr, pm modi, pmo, cmo, kcr delhi tour, modi appoinment, karnataka elections, federal front, kcr front.

Related Post